Home » Telangana » Nizamabad
విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పే పాఠశాలలు కొందరు ఆకతాయిలకు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా తయారవుతున్నాయి. బయట ఎక్కడో కూర్చోని తాగితే బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే పోలీసులు కేసులు పెడతారని ఆలోచన చేస్తు పాఠశాలలనే మద్యం తాగడానికి ఆవాసాలుగా చేసుకుంటున్నారు.
ఆర్మూర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి ఆశీర్వాద ర్యాలీలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
ఎన్నికల వేళ యువత ఓట్లు రాబటేందుకు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. గతంలో మాదిరిగానే డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేపట్టనున్నారు.
కామారెడ్డి జిల్లాలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. కామారెడ్డి నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీ చేయడం, ఆ పార్టీ అభ్యర్థుల పేర్లను వెల్లడించడంతో జిల్లాలో ఒక్కసారిగా రాజకీయం వేడి రాజుకుంది. ఇక ప్రత్యర్థులు ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంటుంది. కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఇతర పార్టీల నుంచి బరిలో నిలిచేదేవరో.. గట్టిపోటీనిచ్చేదెవరోననే చర్చ జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతోంది.
కామారెడ్డి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేయనున్నందున అందరి దృష్టి కామారెడ్డిపై పడింది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు కామారెడ్డిపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. గజ్వేల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ కామారెడ్డికి వెళ్తున్నారనే ప్రచారాన్ని ప్రతిపక్షాలు ముమ్మరం చేశాయి. కామారెడ్డిలోనూ బీఆర్ఎస్కు వ్యతిరేక పవనాలు వీస్తుండడం స్థానిక ప్రజల్లో ఆ పార్టీకి ఆ స్థాయి మద్దతు లేకపోవడంతో కేసీఆర్ను ఢీకొనేందుకు కాంగ్రెస్, బీజేపీలు సిద్ధమవుతున్నాయి.
జిల్లాలో జలుబు, దగ్గు, జ్వరం సమస్యలతో ఆసుపత్రులకు వెళ్తున్న 3 నుంచి 4 నెలల వయస్సు గల పిల్లలు రోజుల వ్యవధిలోనే మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లాలోని పలు మండలాలతో పాటు ఇతర జిల్లాలకు చెందిన చిన్నారులు జలుబు, దగ్గు, జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతూ జిల్లా కేంద్రంలోని ధర్మశాల వద్ద గల ఓ ప్రైవేట్ ఆసుపత్రికి గత 40 రోజులుగా వస్తుండడంతో వారిని పరీక్షించిన వైద్యులకు అసలు ఏ వ్యాధితో పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురవుతూ రోజుల వ్యవధిలోనే మృతి చెందుతున్నారో అర్థం కాకపోవడంతో హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు.
కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లాలో అంతుచిక్కని శిశు మరణాలు సంభవించాయి. నెలరోజుల వ్యవధిలోనే ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. మరణించిన వారందరు నాలుగు నెలల లోపు చిన్నారులు...
సీఎం కేసీఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్తో పాటు కామారెడ్డి నియోజకవర్గంలోనూ పోటీ చేస్తారని స్వయంగా కేసీఆరే ప్రకటించిన విషయం తెలిసిందే. కామారెడ్డికి కేసీఆర్ రాకతో బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత జోష్ నెలకొంటుంది. కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేయనున్నందున ఆ పార్టీ ప్రజా ప్రతినిధులతో పాటు ముఖ్యనేతలు, సామాన్య కార్యకర్తలు రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు కామారెడ్డిలోనే కాకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పార్టీ మరింత పటిష్టం కానుంది. అయితే ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్కు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలను బలహీనపరచాలనే వ్యూహంలో భాగంగానే కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారనే వాదన ప్రతిపక్ష వర్గాల నుంచే కాకుండా అధికార పార్టీలోనూ చర్చ సాగుతోంది. కేసీఆర్ రాకతో పార్టీకి మరింత బలం చేకూరడమే కాకుండా వలసలు పెరిగే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
జిల్లాలో గత నెలలో కురిసిన భారీ వర్షాలతో జలాశయాలన్నీ కళకళలాడుతున్నాయి. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి. అయితే మత్స్యకారులకు సిరులు కురిపించే జలపుష్పాలను మాత్రం ప్రభుత్వం ఇప్పటి వరకు అందించడం లేదు. చేప పిల్లలను ఇప్పుడు వదిలితేనే వేసవి నాటికి మంచి సైజు, బరువుతో మత్స్యకారుల చేతికి వస్తాయి. వారికి మంచి లాభాలు అందిస్తాయి. గతంలో సెప్టెంబరులో చేప పిల్లలను వదలడంతో ఎదుగుదల లోపించినందున ఈ సారైన ఆలస్యం చేయకుండా చేప పిల్లలను వెంటనే పంపిణీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.
టాలెంట్ ఎవరి సొత్తు కాదు. విద్యార్థులు బాగా చదువుకుని గొప్పగా ఎదగాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేజీ (KG) టూ పీజీ (PG) వరకు విద్యను అందిస్తుంది. 2014- 15లో రూ.9000 కోట్ల బడ్జెట్ విద్యా వ్యవస్థకు కేటాయిస్తే ఇప్పుడది రూ.29000 కోట్లకు పెరిగింది. రాష్ట్రంలో 1571 గురుకులాలను అప్ గ్రేడ్ చేశాం.