Home » Telangana » Nizamabad
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ బరిలో ఉంటారనే ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతోంది. కామారెడ్డి నుంచి కేసీఆర్ నిలబడితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ సీట్లను క్లీన్ స్వీప్ చేయవచ్చనే భావనలో అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో పాటు ఆ పార్టీ సామన్య కార్యకర్తలు కోరినట్లు ఆ పార్టీలో చర్చ సాగుతోంది.
జిల్లాలోని ఇప్పటికీ పలు ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు లేక చదువులు సాగడం లేదు. ఇప్పటికీ కొన్ని పాఠశాలల్లో చదువులు చెప్పే వారే కరవవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత నెలకొంటున్నప్పటికీ భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. జిల్లాలో ఏకోపాధ్యాయ ప్రభుత్వ పాఠశాలలు 136 ఉన్నాయి.
జిల్లాలోని 49 మద్యం దుకాణాల్లో 14 మద్యం దుకాణాలకు రిజర్వేషన్లు ఖరారు అయినట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో లక్కీడ్రా చేపట్టారు. ఇందులో గౌడకులానికి 7, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2 దుకాణాలు కేటాయించగా 35 జనరల్ కేటగిరిలో ఉన్నట్లు తెలిపారు. గౌడ కులస్తులకు 3,10,14,26,35,43,46 దుకాణాలు, ఎస్సీలకు 5,15,19,28,37 దుకాణాలు, ఎస్టీలకు 29,31 దుకాణాలు కేటాయించబడినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరిటెండెంట్ రవీంద్రరాజు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులు, అబ్కారిశాఖ అధికారులు పాల్గొన్నారు.
తల్లిపాల ప్రాముఖ్యాన్ని మహిళలకు వివరించేందుకు ప్రభుత్వం ప్రతీ ఏడాది ఆగస్టు మొదటి వారంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తోంది. సమగ్ర శిశు అభివృద్ధి సేవా సంస్థ(ఐసీడీఎస్) ఆధ్వర్యంలోని అంగన్వాడీ కేంద్రాల్లో దీనిపై వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి గర్భిణులు, బాలింతలకు వివరిస్తారు. పలు ప్రాంతాల్లో నేటికీ కాన్పు కాగానే పుట్టిన బిడ్డకు తల్లిపాల(ముర్రుపాలు)ను ఇవ్వరు. దీనిపై ప్రజల్లో అనేక అపోహలున్నాయి. ఆ తర్వాత కూడా తల్లిపాలను ఇవ్వడం తగ్గించి మార్కెట్లో లభించే డబ్బా పాలను పడుతుంటారు. దీని ఫలితంగా పుట్టిన బిడ్డ పెరిగి పెద్దయిన తర్వాత అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలక్షన్ షెడ్యూల్ వస్తే మద్యం దుకాణాలకు టెండర్లు వేసే అవకాశం ఉండకపోవడం ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాదనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మద్యం దుకాణాలకు వేలం వేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మద్యం దుకాణాల టెండర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గురువారం మద్యం దుకాణాల టెండర్ల కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది.
జిల్లాలో గత వారం రోజుల కిందట కురిసిన భారీ వర్షాలు తీవ్ర నష్టాన్నే చేకూర్చాయి. భారీ వర్షాలతో చాలా మంది నిరుపేదలు గూడు కోల్పోగా మరికొందరు రైతుల పంటలు నీట మునిగి అప్పులను మిగిల్చాయి. ప్రభుత్వ ఆస్తులకు సైతం నష్టం వాటిల్లింది.
ఎడతెరిపి లేని వర్షాలతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండే ఇంటి పరిసర ప్రాంతాలు చిత్తడి మారాయి. వీధుల్లో పేరుకపోయిన చెత్తను, ప్రవహిస్తున్న మురుగు నీటిని తొలగించేందుకు సిబ్బంది లేమి స్పష్టంగా కనబడుతోంది. జిల్లాలో ఒకవైపు గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులు సమ్మెలో పాల్గొనడం, మరోవైపు మున్సిపాలిటీల్లో సిబ్బంది తక్కువగా ఉండడంతో అనేక ప్రాంతాల్లో కలుషిత జలాలు సరఫరా అవుతూ ప్రజలకు వ్యాధుల ముప్పు పొంచి ఉండే ప్రమాదాలు నెలకొంటున్నాయి.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో గ్లోబల్ లాజిక్ కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీని స్థాపించాలని వారిని కవిత కోరారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లాలోని ప్రధాన పార్టీలను సమస్యలు వేధిస్తున్నాయి. ఎదుటి పక్షాన్ని ఎదుర్కోవాల్సిన సమయంలో స్వపక్షాన్ని సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ముఖ్య నాయకులకు ఎదురవుతోంది. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాకుండా జిల్లాలోని మూడు ప్రధాన పార్టీల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
ప్రకృతి వైపరీత్యాలను ఎవ్వరూ ఆపలేరని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం వియార్ నెంబర్ 5లోని 3 గేట్ల ద్వారా దిగువకు విడుదలవుతున్న నీటిని ఆయన పరిశీలించారు. గంగమ్మకు పూలు చల్లి మొక్కుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూలైలో నిజాంసాగర్ ప్రాజెక్టు నిండటం ఎంతో గొప్ప విషయమన్నారు.