Hyderabad: కవితతో భేటీ అయిన గ్లోబల్ లాజిక్ కంపెనీ ప్రతినిధులు
ABN , First Publish Date - 2023-07-31T15:12:47+05:30 IST
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో గ్లోబల్ లాజిక్ కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీని స్థాపించాలని వారిని కవిత కోరారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత (Kavitha)తో గ్లోబల్ లాజిక్ కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఐటీ హబ్ (IT Hub)లో కంపెనీని స్థాపించాలని వారిని కవిత కోరారు. నిజామాబాద్‌లో కంపెనీ ఏర్పాటుకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామని స్పష్టం చేశారు. కవిత విజ్ఞప్తిపై గ్లోబల్ లాజిక్ కంపెనీ ప్రతినిధులు (Global Logic Company Representatives) సానుకూలంగా స్పందించారు. రేపు (మంగళవారం) కంపెనీ ప్రతినిధులు నిజామాబాద్ (Nizamabad)లో ఐటీ హబ్‌ను సందర్శించనున్నారు. గ్లోబల్ లాజిక్ సంస్థ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియా (California)లో ఉంది. కాగా హైదరాబాద్ (Hyderabad) కార్యాలయంలో దాదాపు మూడు వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.