Home » Telangana » Rangareddy
భక్తి విశ్వాసాల ముక్తి ప్రధాత... పేదల ఇలవేల్పు... ఆపద మొక్కుల అమ్మ... శక్తి స్వరూపిణిగా వెలుగొందుతున్న కడ్తాల మండలం మైసిగండి మైసమ్మ ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ఎస్సీలకు అందేలా చూడాలని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ తెలిపారు.
పెండింగ్ ధరణి దరఖాస్తులను వచ్చే రెండు నెలల్లో పరిష్కరించాలని కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు.
అధికారులపై దాడి అమానుషమని కలెక్టరేట్ ఏవో సునీల్ అన్నారు. వికారాబాద్ జిల్లాలో అధికారులపై జరిగిన దాడిని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా చేపట్టారు.
వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. లగచర్లలో అధికారులపై దాడి కేసును రేవంత్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా, కొడంగల్ లగచర్ల దాడి పథకం ప్రకారమే జరిగిందని.. బయట గ్రామం నుంచి వచ్చి దాడులకు పాల్పడినట్టు ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. పట్నం నరేందర్‌రెడ్డి సెల్‌ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఫోన్ ఓపెన్ చేసేందుకు మెజిస్ట్రేట్ అనుమతి కోరారు.
లగచర్లలో అధికారులపై జరిగిన దాడి ఘటనతో కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల, రోటిబండ తండావాసులు భయాందోళలనకు గురవుతున్నారు. దుద్యాల మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఫార్మా ఇండస్ట్రియల్ కారిడార్ (ఫార్మా క్లస్టర్) ఏర్పాటుకు భూసేకరణపై ప్రజాభిప్రాయం నిర్వహించేందుకు వెళ్లిన జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులపై జరిగిన దాడి ఘటనతో రెండు రోజులుగా స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
విద్యార్థులు క్రీడలతో పాటు చదువులోనూ ముందుండాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. బుధవారం అనంతగిరిపల్లి సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలల పాఠశాలలో జరుగుతున్న జోనల్ స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు.
యాలాల గ్రామం రామలింగాలకు ప్రతీక. గ్రామం చుట్టూ ఎక్కడ చూసినా రైతుల పొలాల్లో రామలింగాలే దర్శనమిస్తాయి. అందుకేనేమో ఈ గ్రామానికి ‘యాలాల లింగాలు.. కోవూరు జంగాలు’ అని నానుడి ఉంది.
గ్రూప్-3 పరీక్షలో ఎలాంటి తప్పులకు తావు లేకుండా సజావుగా నిర్వహించాలని వికారాబాద్ అదనపు కలెక్టర్ సుధీర్ అధికారులకు సూచించారు. బుధవారం ఈ పరీక్షల నిర్వహణపై ఉన్నతాధికారులతో కలిసి టీజీపీఎస్సీ కమిషన్ చైర్మన్ మహేందర్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.