Home » Telangana » Rangareddy
గో సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడ గ్రామపంచాయతీ మక్తా గ్రామంలో మార్వాడీ కమ్యూనిటీ హాల్లో సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన హాయ్ మాతా మందిరం, గోశాల పూజా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
పాత కక్షలతో బావ, మరిది ఘర్షణపడ్డారు. ఒకరిపై మరొకరు దాడికి పాల్పడటంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయిన ఘటన మండల పరిధిలోని నాగిళ్ల గ్రామంలో చోటుచేసుకొంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగిళ్లకు చెందిన బర్కని యాదయ్యకు మేడిపల్లికి చెందిన మక్కపల్లి శ్రీను సోదరిని ఇచ్చి వివాహం చేశారు. పదేళ్ల క్రితం కుటుంబ కలహాలతో యాదయ్య భార్యను చంపేశాడు.
స్థానిక చిరు వ్యాపారస్తుల కోసం ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించి మేడ్చల్ పట్టణంలో ఏర్పాటు చేసిన రైతు బజార్ నిరుపయోగంగా మారింది.
ఘట్కేసర్లోని బైపా్సరోడ్డులో ఆదివారం రాత్రి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
లారీలో అక్రమంగా కలపను తరలిస్తుండగా పట్టుకున్నట్లు బషీరాబాద్ పోలీసులు తెలిపారు.
మద్యం మత్తులో చెరువులో పడి ఓవ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన బొంరా్సపేట్ మండలంలో జరిగింది.
వికారాబాద్ శివసాగర్ చెరువులో స్కూటీతో సహా పడిన ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని వికారాబాద్ పోలీసులు తెలిపారు.
మండలంలోని నందివనపర్తికి చెందిన జయకృష్ణ నేషనల్ బెస్ట్ యువ పురస్కార్ అవార్డు అందుకున్నారు. ఈమేరకు శనివారం సాయంత్రం రవీంద్రభారతిలో చిల్డ్రన్స్ డేను పురస్కరించుకొని మాజీ స్పీకర్ మధుసూదనాచారి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్, వరంగల్ ఎంపీ కడియం కావ్యల చేతులమీదుగా అవార్డు అందుకున్నారు.
నకిలీ నారుకు కళ్లెం వేయడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందుకోసం నర్సరీలను చట్టం పరిధిలోకి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటినుంచి నర్సరీ నిర్వహణకు లైసెన్సు తప్పనిసరి చేసింది.
రాష్ట్రం అప్పుల కుప్పగా ఉన్నా.. ప్రజలపై పన్నుల భారం మోపకుండానే ఇచ్చిన హామీలను అమలు పరుస్తూ, అభివృద్ధి, సంక్షేమానికి బాటలు వేసిన ఘనత సీఎం రేవంత్రెడ్డికి దక్కుతుందని షాద్నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు. షాద్నగర్ పట్టణంలో ఆదివారం రాత్రి తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమం జరిగింది.