Home » Telangana » Warangal
స్టేషన్‌ఘన్‌పూర్ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వంద పడకల ఆస్పత్రి నిర్మాణా నికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ విషయంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేకంగా దృష్టి సారించారు. బస్టాండ్ సమీపంలో ఉన్న నాలుగెకరాల ఆర్టీసీ స్థలాన్ని ఆస్పత్రికి కేటాయించాలని కోరుతూ ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదలను పంపారు. అధికారులతో కలిసి సంబంధిత స్థలాన్ని పరిశీలించారు. ముందుగా జాతీయ రహదారి నుంచి అక్కడి వరకు రోడ్డు నిర్మించేందుకు ఎస్టిమేషన్స్ సిద్ధం చేయాలని వారిని ఆదేశించారు. సర్కారు నుంచి అనుమతులు రాగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు.
సింగరేణి అనగానే కొందరికీ అదో కల్పతరువుగా మారిపోయిం ది. యాజమాన్యం నిర్లక్ష్యం, సిబ్బంది ఉదాసీనతతో ఏటా సంస్థకు కోట్లాది రూపాయల మేర గండి పడుతోంది. సింగరేణి సిబ్బంది, కార్మికుల కోసం యాజమాన్యం నిర్మించిన నివాస గృహాలు సింగరే ణేతరుల పాలవుతున్నాయి. సంవత్సరాల కొద్దీ తిష్టవేసి సంస్థకు అద్దె చెల్లించకపోగా దత్తపుత్రుల తరహా అన్ని సౌకర్యాలూ అనుభవిస్తునారు.
ఏటూరునాగారం(Eturnagaram) వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆటోను కంటైనర్ ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతదేహాలను బయటకు తీసేందుకు స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
కూతురి ప్రేమ, పెళ్లి వ్యవహారం ఆ దంపతుల దారుణ హత్యకు దారి తీసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తమను పెద్దల్లో పంచాయితీ పెట్టి విడదీశారని యువతి తల్లిదం డ్రులపై కక్ష పెంచుకున్న ఆ యువకుడు.. వారి పాలిట కాలయముడ య్యాడు. గాఢ నిద్రలో ఉన్న వారిపై వేట కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత మార్చాడు. ఇక ఈ దాడిలో ఆ యువకుడి భార్య, ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. వరంగ ల్ జిల్లా చెన్నారావుపేట మండలం పదహారుచింతల్ తండాలో జరిగిన గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ దారుణ ఘటన కలకలం రేపింది.
గత ఏడాది సంభవించిన ప్రకృతి వైపరీత్యాన్ని తలచుకుంటే.. ఇప్పటికీ వెన్నులో వణుకు వస్తోంది. జూలై 27 రాత్రిని మరచిపోలేం. కుంభవృష్టి వర్షం భూపాలపల్లి జిల్లాను అతలాకు తలం చేసింది. వాగులు వంకలు పొంగిపోర్లాయి.. చెరువులు దెబ్బతిన్నాయి. జలదిగ్బంధనంలో జనం చిక్కుకొని విలవిలలాడారు. ఊర్లను వరద ముంచెత్తింది.
కొందరు ఉపాధ్యాయులు చేసే తప్పిదాలు మొత్తం ఆ వర్గానికే మచ్చ తెస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం వచ్చేదాకా ఒక ఆరాటం.. వచ్చాక విద్యపై కాకుండా పదోన్నతులు, బదిలీల కోసం పోరాటం.. అందులోనూ వీలైనంత ఎక్కువ వేతనం పొందేందుకు అడ్డదారులు తొక్కడం.. ఇది ప్రస్తుతం కొంతమంది ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్న తీరు. జిల్లాలో ఇటీవల జరిగిన బదిలీల్లో హెచ్ఆర్ఏ కోసం కొందరు ఉపాధ్యాయులు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. వాటిపై విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
రామప్ప దేవా లయం అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. యునెస్కో గుర్తింపు పొంది నాలుగేళ్లవుతున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉంది. ఎలాంటి పురోగతి ఇక్కడ కనిపించడం లేదు. ఆలయంలో అభివృద్ధి అనే ది ముందుకు సాగడం లేదు.
సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) లేఖ రాశారు. అమెరికా అట్లాంటాలో వరంగల్‌కి చెందిన వెన్నెల అనే అమ్మాయి రోడ్డు ఆక్సిడెంట్లో తీవ్రగాయాలై హాస్పటల్ ఉందని తెలిపారు.
ములుగు: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మంగళవారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా కలెక్టరేట్లో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవంతో పాటు.. దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే వాహనాలు, చక్రాల కుర్చీల పంపిణీ చేయనున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలు.. శంకుస్థాపనలతో పాటు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
నగరంలో ఏర్పాటు చేసిన "రణధీర సీతక్క"(Randheera Seethakka) పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. సీతక్క జీవిత నేపథ్యంతో అస్నాల శ్రీనివాస్ పుస్తకాన్ని రచించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క తన జీవిత విశేషాలను తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.