Minister Seetakka: ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన నేడు..
ABN , Publish Date - Jul 09 , 2024 | 08:19 AM
ములుగు: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మంగళవారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా కలెక్టరేట్‌లో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవంతో పాటు.. దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే వాహనాలు, చక్రాల కుర్చీల పంపిణీ చేయనున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలు.. శంకుస్థాపనలతో పాటు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ములుగు: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క (Minister Seetakka) మంగళవారం ములుగు జిల్లా (Mulugu Dist.)లో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా కలెక్టరేట్‌లో మహిళా శక్తి క్యాంటీన్ (Mahila Shakti Canteen) ప్రారంభోత్సవంతో పాటు.. దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే వాహనాలు, చక్రాల కుర్చీల పంపిణీ చేయనున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలు.. శంకుస్థాపనలతో పాటు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
కాగా ఆదివారం మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించిన విషయం తెలిసందే.. కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం గుడ్లు సరఫరా అవుతున్నాయన్న వార్తలపై అధికారుల నుంచి నివేదిక కోరారు. అంగన్వాడి కేంద్రాలకు నాణ్యమైన వస్తువులు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. నాణ్యత లేని గుడ్లు, వస్తువులు సరఫరా అయితే వాటిని అంగన్వాడీ కేంద్రాలు తిరస్కరించాలని మంత్రి సూచించారు.
లేనిపక్షంలో సంబంధిత అంగన్వాడీ టీచర్లు, స్థానిక అధికారులను బాధ్యుల్ని చేయాల్సి వస్తుందన్నారు. నాసిరకం వస్తువులను సరఫరా చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతే కాకుండా.. సోషల్ మీడియాలో ఓ చిన్నారి పై కొందరు యవకులు జుగుప్సాకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఘటనపై సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలాంటి ఘటనలను సహించేది లేదని స్పష్టం చేసారు. చిన్నారుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్న సీతక్క, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారని మంత్రి తెలిపారు. తండ్రి, చిన్నారి కూతురు మద్య ఉండే ప్రేమానురాగాలపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నిందితులను వదిలి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
ఇంత నీచమా... అతన్ని చూస్తే అసహ్యమేస్తోంది!
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News