Home » Telangana » Warangal
బడి గంటలు మోగాయి. బుధవారం నుం చి ప్రభుత్వ పాఠశాలు పునఃప్రారం భమవుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తంగా 420 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 20,710 మంది విద్యార్ధులు చవువుతున్నారు. మరో 30 పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్ నమోదైంది. 20 నుంచి 30 పాఠశాలల్లో ఒకటి, రెండు తరగతులు ఆంగ్ల మాద్యమం ప్రారంభం కాకపోగా మిగతా అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు పూర్తి స్థాయిలో ఆంగ్ల మాధ్య మ తరగతులను నిర్వహిస్తున్నారు.
పంటల బీమాకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబం ధించి వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో పంటల బీమాను అమలు చేసి రైతులకు ఆర్థిక భరో సా ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం బీమా ప్రక్రియ ను వేగవంతం చేసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కొంత నెమ్మదించగా ప్రస్తుతం వేగం పుంజుకుంది. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద పంటలకు బీమా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
రైస్ మిల్లు నుంచి రావాల్సిన బకాయిలు అందక రైతులు గోసపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.14కోట్ల మేర బకాయిపడ్డ ములుగులోని ఓ రైస్‌మిల్లు యజమాని రైతులకు సుమారు రూ.3 కోట్ల పైనే చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం మిల్లులోని ధాన్యం, బియ్యం నిల్వలు సీజ్ చేసి ఉండటంతో రైతులు డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నారు.
హన్మకొండలో వింత ఘటన చోటు చేసుకుంది. నీటిలో ఓ వ్యక్తి దేహం స్థానికులకు కనిపించింది. దీంతో అతడు చనిపోయాడునుకొని స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి వచ్చి ఆ వ్యక్తిని బయటకు తీసుకొచ్చేందుకు చూడగా ఆ వ్యక్తి ఏం చక్కగా నీటిలో సేదతీరుతూ కనిపించాడు.
వరంగల్: తెలంగాణ శాసనమండలి (Legislative Council) వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్ ఫలితం(By-election Counting Results)పై ఇంకా ఉత్కంఠ వీడలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపోటములు తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వాజేడు మండలం కొంగాల అటవీప్రాంతంలో జూన్ 4న మందుపాతర పేలిన (Landmine Explosion) ఘటనపై మావోయిస్టులు (Maoists) స్పందించారు. మందుపాతర పేలి ఏసు అనే వ్యక్తి మృతిచెందడం బాధాకరమన్నారు. తమ జాడకోసం పోలీసులే ఏసును అటవీప్రాంతంలోకి పంపి ప్రాణాలు తీశారని ఆరోపించారు.
కమలనాథుల ఆశలపై ఓరుగల్లు ఓటర్లు నీళ్లు చల్లారు. 1984 నాటి చరిత్రను పునరావృతం చేస్తామన్న ధీమాలో ఉన్న బీజేపీ నేతలకు ఝలక్ ఇచ్చారు. మోదీ చరిష్మాతో వరంగల్ ఎంపీ స్థానంలో పాగా వేయాలనే పక్కా వ్యూహంతో బరిలో దిగినా ‘గిట్లెట్లయ్యే..’ అంటూ బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. అయితే వ్యూహప్రతివ్యూహాలు ఎలా ఉన్నా సవాళ్లను అధిగమించటంలో బీజేపీ విఫలమైందన్న చర్చ జరుగుతుండగా.. ప్రచారం విషయంలో రాష్ట్ర నాయకత్వం వరంగల్‌పై అంతగా దృష్టిపెట్టలేదని, అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వం లేక ప్రత్యర్థులకు దీటుగా పోల్మేనేజ్మెంట్ చేయలేకపోయారని, శ్రేణులు కూడా చేతులెత్తేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వైద్య పరీక్షల పేరిట ప్రైవేట్ డయాగ్నోస్టిక్, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు ప్రజలను దోచుకుంటున్నారు. వారు చెప్పిందే రేటు అన్నట్టుగా చెల్లించాల్సి వస్తుండటంతో జనం విలవిల్లాడుతున్నారు. వైద్యుడి మాటను కాదని.. మరో చోట పరీక్షలు చేయించుకునే ధైర్యం లేక ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వాహకులు పెట్టిన ఫీజును చెల్లించలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీనంతటికీ వైద్యులు, సెంటర్ల నిర్వాహకుల మధ్య జరిగే కమీషన్ల వ్యవహారమే కారణమన్నది జగమెరిగిన సత్యం. ముఖ్యంగా వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో జరుగుతున్న డయాగ్నస్టిక్, స్కానింగ్ కేంద్రాల దోపిడీపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా బడిబాట కార్య క్రమం నిర్వహించడానికి విద్యాశాఖ సిద్ధమైంది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీచేసింది. 2024-25 విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు గాను ‘బడిబాట’ నిర్వహించడానికి ఉన్నతాధికారులు ఏర్పాట్లను చేశారు.
జిల్లాలో వైద్యశాల ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వం కసరత్తు చేసింది. వంద సీట్ల పరిమితితో మెడికల్ కాలేజీని మంజూరు చేసింది. ఇందుకు రూ. 150 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్టు అప్పట్లో ప్రకటించింది. కానీ ప్రభుత్వం మారాక ఆ ప్రతిపాదనలకు మోక్షం లభించడం లేదు.