Home » Telangana » Warangal
Telangana: ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యపై మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత కొండా మురళీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ..బీసీ నాయకుడివి అయి ఉండి.. పేద బీసీ ప్రజలకు అన్యాయం చేస్తావా అంటూ ఫైర్ అయ్యారు. ‘‘ నేను యునానిమస్‌గా గెలిచి, పార్టీ మారడంతో రాజీనామా చేసినా.. దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి మళ్లీ గెలువు’’ అంటూ సవాల్ విసిరారు.
జనగామ బీఆర్ఎస్లో వర్గపోరు మళ్లీ రాజుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మెుదలైన వేడి ఇంకా చల్లారలేదు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వర్గాల మధ్య పచ్చగడి వేస్తే భగ్గమంటుంది. తాజాగా ఎమ్మెల్సీ పోచంపల్లి పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పల్లా వర్గీయులు చింపేశారంటూ పోచంపల్లి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు త్వరలోనే నగారా మోగనుంది. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలిచ్చిన నేపథ్యంలో యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కసరత్తు సైతం ప్రారంభమైంది.
మద్యంమత్తులో తండ్రే కూతుర్ని విక్రయించిన ఘటన ములుగు జిల్లా నూగురు వెంకటాపురం(Nuguru Venkatapuram)లో చోటు చేసుకుంది. తాగిన మైకంలో కన్న తండ్రే ఓ చిన్నారిని అమ్మిన ఘటన హృదయాల్ని కలచివేస్తోంది.
వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy), అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా "కలంకారీ దరీస్"కి రష్యా దేశంలో అరుదైన అవకాశం దక్కింది. రష్యాలో భారత రాయబార కార్యాలయం, ఓరియంటల్ స్టడీస్, రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సంయుక్తంగా భారత ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో కలంకారీ దరీస్ ప్రదర్శించారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తిలో భాగంగా వరంగల్ జిల్లా నుంచి కలంకారీకి చోటు దక్కినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలలోని గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలు అర్హులందరికీ అందడం లేదు. ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులను ఆన్లైన్ చేసే క్రమంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు చేసిన తప్పిదాలు కొంత మంది అర్హుల పాలిట శాపంగా మారుతున్నాయి.
ములుగు.. అభివృద్ధి దిశగా పయనిస్తోంది. అంచెలంచెలుగా పురోగమనం చెందు తోంది. గ్రామ స్థాయి నుంచి పట్టణంగా పురోగతి సాధిస్తోంది. ఐదేళ్ల క్రితం జిల్లా కేంద్రంగా ఏర్పడిన ములుగు తాజాగా మునిసిపాలిటీగా గుర్తింపు పొం దింది. రాష్ట్ర మంత్రి సీతక్క చొరవతో దీని సుంద రీకరణకు యంత్రాంగం ముందడుగు వేసింది. ఇందు లో భాగంగా హెచ్ఎండీఏ అధికారుల పర్యవేక్షణలో యాక్షన్‌ప్లాన్ సద్ధమవుతోంది.
పెద్ద దిక్కును కోల్పోయిన అన్నదాతల కుటుంబాలకు రైతు బీమా పథకం ఆసరా గా నిలుస్తోంది. కర్షకులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చే ఈ పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిం ది. కొత్తగా పట్టాదారు పుస్తకాలు పొందిన వారు, గతంలో బీమా పథకంలో ఉండి నామినీ చనిపోయిన వారు, ఆధార్‌కార్డులో తప్పులు ఉన్నవారు సరిదిద్దుకు నేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.
రైతన్నల ఆలోచనల్లో మార్పు వస్తోంది. వ్యవసాయం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కు తోంది. సాగులో అన్నదాతలు వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు. ఇందులో భాగంగా దొడ్డు రకం వరికి స్వస్తి పలికారు.. సన్నరకాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.