Share News

Konda muarali: బస్వరాజు సారయ్యపై కొండా మురళి ఫైర్

ABN , Publish Date - Aug 22 , 2024 | 01:57 PM

Telangana: ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యపై మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత కొండా మురళీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ..బీసీ నాయకుడివి అయి ఉండి.. పేద బీసీ ప్రజలకు అన్యాయం చేస్తావా అంటూ ఫైర్ అయ్యారు. ‘‘ నేను యునానిమస్‌గా గెలిచి, పార్టీ మారడంతో రాజీనామా చేసినా.. దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి మళ్లీ గెలువు’’ అంటూ సవాల్ విసిరారు.

Konda muarali: బస్వరాజు సారయ్యపై కొండా మురళి ఫైర్
Congress Leader Konda Murali

వరంగల్, ఆగస్టు 22: ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యపై (MLC Baswaraju Saraiah) మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత కొండా మురళీ (Congress Leader Konda Murali) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ..బీసీ నాయకుడివి అయి ఉండి.. పేద బీసీ ప్రజలకు అన్యాయం చేస్తావా అంటూ ఫైర్ అయ్యారు. ‘‘నేను యునానిమస్‌గా గెలిచి, పార్టీ మారడంతో రాజీనామా చేసినా.. దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి మళ్లీ గెలువు’’అంటూ సవాల్ విసిరారు. వరంగల్‌లో (Warangal) కొండా మురళీ హవా నడుస్తోందన్నారు.

MLC Kavitha: కవితకు మళ్లీ అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..


పోచమ్మ మైదాన్‌లో ఇటీవల తొలగించిన డబ్బాల బాధితులను మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ పరామర్శించారు. అయితే డబ్బాలను తొలగించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అయినా.. తనకు ప్రజలే ముఖ్యమని స్పష్టం చేశారు. కొండా దంపతులు ఉన్నంతవరకు ఎవరికి అన్యాయం జరగనివ్వమని కొండా మురళి పేర్కొన్నారు.


గన్‌పార్క్ వద్ద నిరసన..

మరోవైపు.. అదానీ అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ నిరసన కార్యక్రమం జరిగింది. సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలని డిమాండ్ చేయగా.. ఆయన డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు దేశ వ్యాప్తంగా ఏఐసీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ఈ నిరసన కార్యక్రమంలో మంత్రి సీతక్క సైతం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఆదాని అక్రమాలపై అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రధాని అక్రమాలపై విచారణ చేయాల్సిన సెబీ పెద్దలే ఆయన కంపెనీలో పెట్టుబడులు పెట్టారని ఆరోపణలు ఉన్నాయని మంత్రి తెలిపారు.


హిడెన్ బర్గ్ అనే సంస్థ ఆదాని అక్రమాలపై ఆధారాలు కూడా బయటపెట్టిందనిన్నారు. ప్రధాని మోదీ, ఆదాని వేరు వేరు కాదన్నారు. ఇద్దరూ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారని ప్రజల ఆస్తులను కాజేస్తున్నారని ఎంతో కాలం క్రితమే రాహుల్ గాంధీ చెప్పారని సీతక్క తెలిపారు. అప్పట్లో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. కాంగ్రెస్ గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఆదాని తప్పులపై మాత్రం చర్యలు లేవన్నారు. ఆదాని అవకతవకలపై చర్యలు చేపట్టాల్సిన సెబి పెద్దలే అతనితో చేతులు కలిపారన్నారు. తల్లి దయ్యమైతే పిల్లలను ఎవరు కాపాడాలని సీతక్క ప్రశ్నించారు. దేశ సంపదను ఆదాని కొల్లగొడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రజలకు దిక్కెవరని నిలదీశారు. ఆదాని అక్రమాలపై విచారణ చేయాలని ఈడి ఆఫీస్ ముందు నిరసన తెలియజేస్తున్నామని సీతక్క పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

AICC: దేశవ్యాప్తంగా నిరసనలకు ఏఐసీసీ పిలుపు

TG News:10 ఐ ఫోన్లను ఆ కొరియర్ బాయ్ ఏం చేశాడో తెలుసా!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 22 , 2024 | 02:02 PM