Viral Video: బుడ్డోడే కానీ.. భలే మంచి పని చేశాడు.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు..
ABN , First Publish Date - 2021-12-09T23:46:50+05:30 IST
సాధారణంగా చిన్నపిల్లలు ఆటల్లో మునిగిపోతుంటారు. కానీ మనం చూడబోయే బుడ్డోడు మాత్రం.. అంతా శభాష్.. అంటూ మెచ్చుకునే పని చేశాడు. ఆ చిన్నారి మానవత్వానికి ఫిదా అయిన ఐసీఎస్ అధికారి..
చిన్న పిల్లలు చేసే పనులు చూడముచ్చటగా ఉంటాయి. తెలిసీ తెలీని వయసులో వారు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. కొందరు పిల్లలైతే పెద్దవారి తరహాలో పనులు చేస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. అలాంటి పిల్లలను చూసినప్పుడు, వీల్లు పిల్లలు కాదు.. పిడుగులు.. అని అనిపిస్తుంటుంది. అలాంటి పిల్లలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా చిన్నపిల్లలు ఆటల్లో మునిగిపోతుంటారు. కానీ మనం చూడబోయే బుడ్డోడు మాత్రం.. అంతా శభాష్.. అంటూ మెచ్చుకునే పని చేశాడు. ఆ చిన్నారి మానవత్వానికి ఫిదా అయిన ఐసీఎస్ అధికారి.. ఆ వీడియోను షేర్ చేశాడు..
చేతిబోరు వద్ద ఓ కుక్కపిల్ల నీటి కోసం వెంపర్లాడుతోంది. దాన్ని గమనించిన ఓ బుడ్డోడికి విషయం అర్థమైంది. సాధారణంగా అంత చిన్న పిల్లలకు మానవత్వం అంటే ఏంటో కూడా తెలీదు. అలాంటిది, పెద్దవారి తరహాలో ఈ బుడ్డోడు మాత్రం తన మానవత్వాన్ని చాటుకున్నాడు. బోరు ఎత్తు కూడా లేని ఆ చిన్నారి.. పైపును చేతులతో పట్టుకుని నీరు వచ్చే వరకూ కదపడం అందరినీ ఆకట్టుకుంటుంది. కొద్ది సేపటి తర్వాత చిన్న చిన్న నీటి ధారలు బయటికి రాగానే.. కుక్క పిల్ల దాహం తీర్చుకుంటుంది.
ఒంటెలకు కూడా అందాల పోటీలా..? అని అవాక్కవుతున్నారా..? ఆ పోటీల్లో గెలిచేందుకు యజమానులు చేసే నిర్వాకాలేంటో తెలిస్తే..
ఈ సన్నివేశాన్ని స్థానికంగా ఉండే ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించాడు. ఈ వీడియో.. పీఎస్ అధికారి దీపాంశు కబ్రాను ఆకట్టుకుంది. దీంతో వెంటనే తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘ఎంత చిన్న వారైనా, ఎవరైనా ఎవరికైనా వీలైనంత సాయం చేయవచ్చు’ అనే క్యాప్షన్‌తో వీడియోను పోస్టు చేశాడు. ఇంత చిన్న వయసులో కూడా బుడ్డోడిలో మానవత్వం కనిపిస్తోందంటూ.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.