అర్జెంట్‌గా ఫోన్ చేసుకోవాలి.. ప్లీజ్.. అంటూ మార్కెట్లో ఓ కుర్రాడు అడగడంతో సరేనని మొబైల్ ఇచ్చాడో వ్యక్తి.. చివరకు..

ABN , First Publish Date - 2021-09-10T21:01:01+05:30 IST

రోడ్డుపై నిలబడిన ఓ వ్యక్తి దగ్గరకు ఓ కుర్రాడు వచ్చి.. `అర్జెంట్‌గా ఫోన్ చేసుకోవాలి.. మీ మొబైల్ ఒక్కసారి ఇస్తారా..` అని అడిగాడు..

అర్జెంట్‌గా ఫోన్ చేసుకోవాలి.. ప్లీజ్.. అంటూ  మార్కెట్లో ఓ కుర్రాడు అడగడంతో సరేనని మొబైల్ ఇచ్చాడో వ్యక్తి.. చివరకు..

రోడ్డుపై నిలబడిన ఓ వ్యక్తి దగ్గరకు ఓ కుర్రాడు వచ్చి.. `అర్జెంట్‌గా ఫోన్ చేసుకోవాలి.. మీ మొబైల్ ఒక్కసారి ఇస్తారా..` అని అడిగాడు.. దాంతో ఆ వ్యక్తి మొబైల్ ఇచ్చాడు.. ఆ కుర్రాడు మాట్లాడుతూ ముందుకు వెళ్లి బైక్ ఎక్కి వెళ్లిపోయాడు.. దీంతో ఫోన్ ఇచ్చిన వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.. అప్పటికే అలాంటి ఫిర్యాదులు రావడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


రాయ్‌పూర్‌కు చెందిన బబ్లూ సోని, శుభమ్ సోనీ కొద్ది నెలలుగా నగరంలో మొబైల్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. నడుచుకుంటూ మొబైల్ మాట్లాడుతున్న వ్యక్తుల వెనగ్గా బైక్ మీద వెళ్లి మొబైల్ లాక్కుని వెళ్లిపోవడం, `అర్జెంట్‌గా ఫోన్ చేసుకోవాలి.. మీ మొబైల్ ఒక్కసారి ఇస్తారా.. ప్లీజ్` అని అడిగి మొబైల్ పట్టుకుని పారిపోవడం వంటివి చేస్తున్నారు. అలాంటి కేసులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో దాదాపు పది వరకు నమోదయ్యాయి. 

ఇవి కూడా చదవండి

ప్రెస్‌మీట్‌లో శృంగారం గురించి ప్రశ్న.. న్యూజిలాండ్ ప్రధాని షాకింగ్ రియాక్షన్.. నెట్టింట వీడియో వైరల్





షాపులో కౌంటర్‌పైకి సడన్‌గా దూకిన ఆరు అడుగుల పాము.. ఆ కుర్రాడి వెన్నులో వణుకు..


పోలీసులు వారి గురించి వెతకడం మొదలుపెట్టారు. గురువారం ఉదయం శ్యామ్‌నగర్ మార్కెట్లో ఇద్దరు కుర్రాళ్లు ఖరీదైన ఫోన్లను తక్కువ రేట్లకే అమ్ముతున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వివిధ కంపెనీలకు చెందిన 9 మొబైల్ ఫోన్లను, పల్సర్ బైక్‌ను, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2021-09-10T21:01:01+05:30 IST