Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంకా ప్రారంభం కాని AP Assembly.. సీఎం జగన్ ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ.. వాట్ నెక్స్ట్..!

అమరావతి : ఇవాళ ఉదయం వాయిదా పడిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కాలేదు. ఈ గ్యాప్‌లోనే మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్లు జగన్ ప్రభుత్వం సంచలన ప్రకటనే చేసింది. అయితే.. అసెంబ్లీ సమావేశాలు తిరిగి మళ్లీ ఎన్ని గంటలకు ప్రారంభం అవుతాయా..? అనే దానిపై అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ బిల్లు వెనక్కి తీసుకున్నాకా.. మరో బిల్లును సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. అంతేకాదు.. అసలు ఈ బిల్లును ఎందుకు వెనక్కి తీసుకున్నారనే దానిపై జగన్ పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారు. అయితే ఇంకా అసెంబ్లీ ప్రారంభం కాలేదు. దీంతో సీఎం ఏం ప్రకటన చేస్తారో అనేదానిపై నిమిషనిమిషానికి జనాల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

వాట్ నెక్స్ట్..!

కాగా.. ప్రస్తుతం అసెంబ్లీలోని ఛాంబర్‌లో కొద్దీ మంది మంత్రులు, అధికారులతో మాత్రమే సీఎం చర్చలు జరుపుతున్నారు. ‘రద్దు సరే.. తరువాత ఏంటి..?’ అనేదానిపై జగన్ నిశితంగా చర్చిస్తున్నారు. అయితే అధికార పార్టీ కీలక నేతలకు ఇంతవరకూ దీనిపై ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. సీఎం ప్రకటనలో మెలిక ఉంటుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. మంత్రి పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి కొద్దిసేపటి క్రితం‘ఇది ఇంట్రవెల్ మాత్రమే.. సినిమా ఇంకా పూర్తికాలేదు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో రకరకాల చర్చలు, ఊహాగానాలు వస్తున్నాయి. అయితే.. సాంకేతిక అంశాల కోసమే తాజా డ్రామా అని రాజధాని రైతులు అంటున్నారు. మరోవైపు.. ఏపీలోని తాజా పరిణామాలను నిపుణులు, ప్రతిపక్ష నేతలు చాలా లోతుగా గమనిస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement