Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ సారి నిన్ను దేవుడు కూడా కాపాడలేడు.. ఇదీ ఆస్పత్రిలో ఉన్న భర్తకు ఓ భార్య వార్నింగ్.. ఇంతకీ అసలేం జరిగిందంటే..

పతియే ప్రత్యక్ష దైవం అనుకునే ఆడవాళ్లు ఉన్న ఈ దేశంలో.. భర్తలను చిత్రహింసలకు గురి చేసే మహిళలు కూడా ఉంటారన్నది అక్షర సత్యం. హర్యానాలో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి బయటపడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న భర్తకు భార్య గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పడు టైం బాగుండి బతికిపోయావ్.. ఇంకోసారి నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు.. అంటూ వార్నింగ్ ఇచ్చింది. భార్య అన్న మాటలకు భర్త ఒక్కసారిగా కంగుతిన్నాడు. అసలు ఏం జరిగిందంటే..

హర్యానాలోని రోహ్‌తక్ జిల్లా ఠాణా శివాజీ కాలనీ ప్రాంతానికి చెందిన పవన్(35), శిరీష ( పేర్లు మార్చాం) దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో శిరీషకు పవన్ మేనల్లుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్తకు తెలీకుండా రోజూ కలుసుకునేవారు. అయితే భర్తను హత్య చేస్తే తమకు అడ్డు లేకుండా పోతుందని శిరీష్, ఆమె ప్రియుడు కుట్ర పన్నారు. ఓ రోజు భర్తకు టీలో విషం కలిపి ఇచ్చింది. ఇది తాగిన పవన్ కాసేపటికే రక్తపు వాంతులు చేసుకుంటూ కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

9నెలల క్రితం కొడుక్కు పెళ్లి.. కాపాడండంటూ రాత్రిపూట కోడలి కేకలు.. కంగారుగా గదిలోకి ఆ తండ్రి వెళ్లి చూస్తే..

సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే భర్తను చూడటానికి వెళ్లిన భార్య, అతడి చెవిలో ‘‘ ఈ సారికి బతికిపోయావ్.. ఇంకోసారి నిన్ను దేవుడు కూడా కాపాడలేడు’’.. అంటూ వార్నింగ్ ఇవ్వడంతో షాక్ అయ్యాడు. అంతటితో ఆగకుండా.. ‘‘మీ మేనల్లుడు చంపమంటేనే ఇలా చేశా’’.. అంటూ అసలు విషయం చెప్పేసింది. భార్య మాటలకు షాక్ అయిన భర్త.. విషయం మొత్తం పోలీసులకు తెలియజేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కూతురు బతుకుతుందని 2నెలలుగా ఎదురుచూపులు.. ఆ తల్లిదండ్రులు రోజూ చేసే పని చూసి..

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement