Advertisement
Advertisement
Abn logo
Advertisement

15 రోజుల క్రితం పెళ్లి.. గంటల తరబడి చాటుగా భార్య ఫోన్ కాల్స్.. నిఘా వేసి భర్త ఇచ్చిన ట్విస్ట్‌తో ఆమెకు మైండ్‌బ్లాంక్..!

పెళ్లి పేరుతో భార్యాభర్తలుగా మారి, జీవితాంతం అదే అనుబంధాన్ని కొనసాగిస్తారు. అయితే కొన్నిసార్లు అదే పెళ్లి పేరుతో మోసాలు కూడా జరుగుతుంటాయి. రాజస్థాన్‌లో జరిగిన ఘటన చాలా విచిత్రంగా ఉంది. 15రోజుల క్రితం వివాహం జరిగింది. కొత్తగా అత్తింట్లో అడుగుపెట్టిన వధువు, భర్తతో సంతోషంగా ఉండకుండా.. చాటుమాటుగా గంటల తరబడి ఫోన్లలో మాట్లాడటం మొదలెట్టింది. భర్తకు అనుమానం వచ్చి నిఘా పెట్టడంతో విషయం మొత్తం బయటపడింది. అసలు ఏం జరిగిందంటే..

రాజస్థాన్‌ బార్మర్ జిల్లా రామ్‌దేవారియా నివాసి ఉమ్మేదరామ్ చాలా కాలంగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి స్థానికంగా ఉన్న మ్యారేజ్ బ్రోకర్ జుంజారామ్, పంజాబ్‌లోని జలాలాబాద్‌కు చెందిన సోనూ, జస్వంత్‌సింగ్‌ల సహకారంతో కోటుబాయి అనే యువతితో పెళ్లి నిశ్చయమైంది. అందుకు గాను ఉమ్మేదరామ్‌ నుంచి వారు రూ.3లక్షలు తీసుకున్నారు. డిసెంబర్ 27న ఉమ్మేదరామ్, కోటుబాయి వివాహం జరిగింది. తర్వాత భర్తతో పాటూ అత్తింట్లో అడుగుపెట్టింది. కొన్ని రోజుల పాటు భార్యభర్తలు అన్యోన్యంగా ఉంది.

18 ఏళ్ల కూతురు కనిపించడం లేదంటూ ఓ తండ్రి ఫిర్యాదు.. పోలీసులు చెప్పింది విని అంతా షాక్.. మరో యువతితో కలిసి..

ప్రతీకాత్మక చిత్రం

అత్తింట్లోకి అడుగుపెట్టిన కోటుబాయి.. కొన్ని రోజుల పాటు ఎవరికీ అనుమానం రాకుండా ఉంది. అయితే 15రోజులు కూడా గడవకుండానే భర్తకు తెలీకుండా రోజూ గంటల తరబడి ఫోన్లలో మాట్లాడటం మొదలెట్టింది. ఓ రోజు భర్తకు అనుమానం వచ్చి నిఘా పెట్టాడు. ఇలా జరుగుతుండగానే కోటుబాయి, తన స్నేహితురాలు గీతారాణిని కలిసి పంజాబ్‌కు పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఈ విషయాన్ని ఉమ్మేదరామ్.. పోలీసులకు తెలియజేశాడు. దీంతో కోటుబాయి, గీతారాణిని అరెస్ట్ చేసి విచారించారు.

ఈ సారి నిన్ను దేవుడు కూడా కాపాడలేడు.. ఇదీ ఆస్పత్రిలో ఉన్న భర్తకు ఓ భార్య వార్నింగ్.. ఇంతకీ అసలేం జరిగిందంటే..

పోలీసు విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. కోటుబాయికి అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసింది. కొందరు వ్యక్తులంతా కలిసి ముఠాగా ఏర్పడి.. పెళ్లిళ్లు చేయడం తర్వాత నగదు, నగలు ఎత్తుకెళ్తుంటారని విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కోటుబాయి, ఆమెకు సహకరించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇలా ఎంత మందిని మోసం చేశారు.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

9నెలల క్రితం కొడుక్కు పెళ్లి.. కాపాడండంటూ రాత్రిపూట కోడలి కేకలు.. కంగారుగా గదిలోకి ఆ తండ్రి వెళ్లి చూస్తే..

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement