ఊహించని కారణంతో మూడేళ్ల క్రితం చెట్టును పెళ్లి చేసుకున్న యువతి.. ఇప్పుడు ఏం చెప్తోందంటే..

ABN , First Publish Date - 2021-12-22T03:08:57+05:30 IST

యూకేలో మెర్సీసైడ్‌లోని సెఫ్టన్‌లో 37 ఏళ్ల కేట్ కన్నింగ్‌హామ్ అనే మహిళ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఏళ్ల నాటి వృక్షాన్ని ఎంచుకుని 2019లో పెళ్లి చేసుకుంది. తన ఇంటిపేరును కూడా ఎల్డర్‌గా మార్చుకుంది...

ఊహించని కారణంతో మూడేళ్ల క్రితం చెట్టును పెళ్లి చేసుకున్న యువతి.. ఇప్పుడు ఏం చెప్తోందంటే..

కొందరి నిర్ణయాలు చాలా వినూత్నంగా, ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. చూసే వారికి విచిత్రంగా అనిపించినా.. వారు అలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా బలమైన కారణం ఉంటుంది. కొందరు తమ కుటుంబం కోసం నిర్ణయాలు తీసుకుంటే.. మరికొందరు సమాజం మొత్తం బాగుండాలని వినూత్న నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. యూకేలో ఓ మహిళ ఇలాగే అనూహ్య నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల క్రితం ఓ చెట్టును పెళ్లి చేసుకుంది. దీనికి ఆమె ఏం కారణం చెబుతోందంటే..


యూకేలో మెర్సీసైడ్‌లోని సెఫ్టన్‌లో 37 ఏళ్ల కేట్ కన్నింగ్‌హామ్ అనే మహిళ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఏళ్ల నాటి వృక్షాన్ని ఎంచుకుని 2019లో పెళ్లి చేసుకుంది. తన ఇంటిపేరును కూడా ఎల్డర్‌గా మార్చుకుంది. కుటుంబ సభ్యులందరినీ ఇంట్లో వదిలి.. ఈ నెలలో వచ్చే బాక్సింగ్ డేని తన బెటర్ హాఫ్‌తో గడపాలని ప్లాన్ చేసుకుంటుందట. ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ బలమైన కారణం ఉంది.

పాత దుస్తులను అమ్మేందుకు ఆ మహిళ ప్రయత్నిస్తే.. రూ.1.9 లక్షలు మటాష్.. అసలేం జరిగిందంటే..


రిమ్రోస్ వ్యాలీ కంట్రీ పార్క్ గుండా బైపాస్ నిర్మించాలని అధికారులు నిర్ణయించారట. దీన్న వ్యతిరేకిస్తూ ఆమె ఆ పార్క్‌లోని ఈ పెద్ద వృక్షాన్ని పెళ్లి చేసుకుంది. పర్యావరణ హితం కోసం పోరాడిన ఎంతోమంది మహిళను ఆదర్శంగా తీసుకున్నట్లు చెబుతోంది. తాను వివాహం చేసుకున్న చెట్టును వారానికి ఐదు సార్లు సందర్శిస్తానని తెలిపింది. ఆ చెట్టుతో కలిసి మూడో క్రిస్మస్‌ని ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొంది. క్రిస్మస్‌ను పురస్కరించుకుని.. ఆ చెట్టును అందంగా అలంకరించింది. కేట్ నిర్ణయాన్ని ఆమె కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారట.

బస్సు టికెట్‌పై ఫోన్ నెంబర్ రాసి ఇచ్చిన కండక్టర్.. ఆ ప్రయాణికురాలు ఇచ్చిన ట్విస్ట్‌ మామూలుగా లేదుగా..!

Updated Date - 2021-12-22T03:08:57+05:30 IST