Share News

YS Sharmila: ఇక్కడ ఫెయిల్ అయిన వ్యక్తి ఇంకో దగ్గర ఎలా పనికొస్తాడు?.. గుమ్మనూరుపై షర్మిల ఫైర్

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:50 PM

Andhrapradesh: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. శుక్రవారం ఆలూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షర్మిల.. ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలకు అభివృద్ధి మీద చిత్తశుద్ది లేదని విమర్శించారు. ‘‘ఇదే ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం.. ఇక్కడ చెత్త తీసి వేరే చోటకి పంపాడట. ఈ నియోజకవర్గానికి పనికి రాడని వేరే నియోజక వర్గం ఇచ్చాడట’’...

YS Sharmila: ఇక్కడ ఫెయిల్ అయిన వ్యక్తి ఇంకో దగ్గర ఎలా పనికొస్తాడు?.. గుమ్మనూరుపై షర్మిల ఫైర్
APCC Chief YS sharmila Reddy

కర్నూలు, ఏప్రిల్ 19: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. శుక్రవారం ఆలూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షర్మిల.. ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై (Alur MLA Gummanuru Jayaram) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలకు అభివృద్ధి మీద చిత్తశుద్ది లేదని విమర్శించారు. ‘‘ఇదే ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం.. ఇక్కడ చెత్త తీసి వేరే చోటకి పంపాడట. ఈ నియోజకవర్గానికి పనికి రాడని వేరే నియోజక వర్గం ఇచ్చాడట. ఇక్కడ ఫెయిల్ అయిన వ్యక్తి ఇంకో దగ్గర ఎలా పనికి వస్తాడు? కార్మిక శాఖ మంత్రిగా ఒక్క ఉద్యోగం ఇచ్చారా? నియోజక వర్గానికి పనికి వచ్చారా ? నియోజక వర్గంలో మొత్తం దోపిడీ అంట కదా’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

Chandrababu Nomination: చంద్రబాబు నామినేషన్.. బాబోయ్.. భువనేశ్వరి క్రేజ్ చూశారో..?


వేదవతి ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అని జగన్ (CM Jagan) హామీ ఇచ్చారని.. 5 ఏళ్లలో ప్రాజెక్ట్ నిర్మాణానికి ఒక్క అడుగు పడలేదన్నారు. 2008 లో వైఎస్ఆర్ (YSR) శిలాఫలకం వేశారని.. అదే ప్రాజెక్ట్‌కు జగన్ మోహన్ రెడ్డి మరో శిలాఫలకం వేశారన్నారు. జగన్ ప్రభుత్వం శిలాఫలకం ప్రభుత్వం అంటూ ఎద్దేవా చేశారు. ప్రాజెక్ట్ కట్టి ఉంటే 80 వేల ఎకరాలకు సాగునీరు వచ్చి ఉండేదన్నారు. నియోజకవర్గంలో టమాటా ఎక్కువ పండుతుందని తెలిపారు. రైతుల కోసం ఫడ్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నారని.. ఇప్పటికీ కట్టలేదన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.

TS Politics: బీఆర్‌ఎస్‌‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే?


ధర స్థిరీకరణ నిధి అని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. రైతును వైఎస్సార్ రాజును చేశాడని.. ఇప్పుడు రైతు అప్పుల పాలు అయ్యారన్నారు. మూర్ఖులకు, అహంకారులకు ఓటు వెయొద్దని కోరారు. ‘‘మీ ఓటు వృధా కానివ్వొద్దు. వైసీపీకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్లే. ఈసారి ఆలోచన చేసి ఓటు వేయండి’’ అని వినతి చేశారు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. హోదా ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని స్పష్టం చేఝశారు. అధికారమిస్తే 2.25 లక్షల ఉద్యోగాలు పక్కా అని వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి...

AP Elections: నిజంగా నిరుపేద.. బుట్టా

Laptop: రూ.17 వేలకే 8 జీబీ ర్యామ్ ల్యాప్‌టాప్.. అదిరిపోయే ఆఫర్

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 19 , 2024 | 01:53 PM