Share News

AP Elections 2024: టీడీపీ సూపర్ సిక్స్ పథకాల ముందు తేలిపోయిన వైసీపీ మేనిఫెస్టో: అశోక్ బాబు

ABN , Publish Date - Apr 27 , 2024 | 10:25 PM

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల ముందు వైసీపీ (YSRCP) మేనిఫెస్టో తేలిపోయిందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు (Ashok Babu) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ రెడ్డిపై ఎమ్మెల్సీ అశోక్ బాబు టీడీపీ నేత జీవిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ... ఏపీని అభివృద్ధి చేయలేనని సీఎం జగన్ రెడ్డి చేతులెత్తేశారని విమర్శించారు. చెప్పిన అబద్ధాలనే జగన్ రెడ్డి మళ్లీ మేనిఫెస్టోలో వళ్లించారని ఆక్షేపించారు.

 AP Elections 2024: టీడీపీ సూపర్ సిక్స్ పథకాల ముందు తేలిపోయిన వైసీపీ మేనిఫెస్టో: అశోక్ బాబు
Ashok Babu

అమరావతి: తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల ముందు వైసీపీ (YSRCP) మేనిఫెస్టో తేలిపోయిందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు (Ashok Babu) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ రెడ్డిపై ఎమ్మెల్సీ అశోక్ బాబు టీడీపీ నేత జీవిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ... ఏపీని అభివృద్ధి చేయలేనని సీఎం జగన్ రెడ్డి చేతులెత్తేశారని విమర్శించారు. చెప్పిన అబద్ధాలనే జగన్ రెడ్డి మళ్లీ మేనిఫెస్టోలో వళ్లించారని ఆక్షేపించారు.


AP Elections: కొత్త స్కీం లేదు.. మెరుపులు లేవు.. తేలిపోయిన వైసీపీ మేనిఫెస్టో

కొత్త సీసాలో పాత సారాలా వైసీపీ మేనిఫెస్టో ఉందని ఎద్దేవా చేశారు. చేయగలిగినవే చెబుతున్నామంటూ జగన్ చేతగాని మాటలు చెబుతున్నారని విమర్శించారు. అవ్వాతాతలకు మేనిఫెస్టోలో జగన్ షాకిచ్చారన్నారు. వైసీపీ మేనిఫెస్టోలో ఉపాధి, ఉద్యోగాల జాడ లేదన్నారు. మద్య నిషేధం ఊసేలేదని చెప్పారు. వైసీపీ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా ఎందుకు లేదని ప్రశ్నించారు. పోలవరంతో పాటు సాగునీటి ప్రాజెక్టులను జగన్ రెడ్డి పక్కన పెట్టారని మండిపడ్డారు. అమ్మఒడి మరో రూ.2 వేలు పెంచి ఒక బిడ్డకే ఇస్తానంటూ అమ్మలకు కూడా జగన్ షాక్ ఇచ్చారన్నారు.


AP Elections 2024: రాజధానిపై జగన్ నిర్ణయం ఇదే.. అమరావతిపై మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే!

ఎంత మంది బిడ్డలు ఉంటే అందరికీ తల్లికి వందనం ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారన్నారు. రైతులకు కూడా వైసీపీ మేనిఫెస్టోలో నిరాశే మిగిలిందన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి రూ.16వేలు మాత్రమే ఇస్తామంటూ జగన్ ప్రకటించారని అన్నారు. టీడీపీ మేనిఫెస్టోలో అన్నదాత పథకం ద్వారా రైతుకు ఏడాదికి రూ.20 వేలు లబ్ధిచేకూర్చారని తెలిపారు. వైసీపీ మేనిఫెస్టోను చూసిన ఆ పార్టీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు.


ఇవి కూడా చదవండి

AP Elections: సిగ్గు, సంస్కారం వదిలేశారు.. జగన్‌పై షర్మిల సంచలన కామెంట్స్..

AP Elections: వైసీపీ మేనిఫెస్టో: నాడు - నేడు

Chandrababu: నేరాలు, ఘోరాలు, అరాచకాల్లో జగన్ పీహెచ్డీ చేశారు

Read Latest Andhra pradesh News or Telugu News

Updated Date - Apr 27 , 2024 | 10:27 PM