Share News

AP Elections 202; వచ్చే నెలలో కూడా పెన్షన్ ఇంటి వద్దే ఇవ్వాలి.. కూటమి నేతల డిమాండ్

ABN , Publish Date - Apr 27 , 2024 | 07:49 PM

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ (AP Governor Abdul Nazir)ను తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి నేతలు శనివారం కలిశారు. వచ్చే మే నెల పింఛన్ల (pensions) పంపిణీ ఇంటి వద్దే 1,2 వ తేదీల్లో ఇచ్చేలా చూడాలని గవర్నర్‌ను ఎన్డీఏ నేతలు కోరారు. గవర్నర్‌‌ను కలిసిన అనంతరం కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు.

 AP Elections 202; వచ్చే నెలలో  కూడా పెన్షన్ ఇంటి వద్దే ఇవ్వాలి.. కూటమి నేతల డిమాండ్

విజయవాడ: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ (AP Governor Abdul Nazir)ను తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి నేతలు శనివారం కలిశారు. వచ్చే మే నెల పింఛన్ల (AP pensions) పంపిణీ ఇంటి వద్దే 1,2 వ తేదీల్లో ఇచ్చేలా చూడాలని గవర్నర్‌ను ఎన్డీఏ నేతలు కోరారు. గవర్నర్‌‌ను కలిసిన అనంతరం కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు.


AP Elections: కొత్త స్కీం లేదు.. మెరుపులు లేవు.. తేలిపోయిన వైసీపీ మేనిఫెస్టో

పెన్షన్ పంపిణీపై కుట్ర పన్నారు: వర్ల రామయ్య

సీఎం జగన్మోహన్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి కలసి పెన్షన్ పంపిణీపై కుట్ర పన్నారని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పింఛన్ల పంపిణీపై రాజకీయం చేసి కొంతమంది వృద్ధుల ప్రాణాలైనా పోతే ప్రతిపక్షాలపై బురదజల్లాలని జగన్ నాటకం ఆడారని చెప్పారు. ఉపాధ్యాయులను సారా కొట్ల దగ్గర పెట్టిన సిగ్గుమాలిన , దుర్మార్గపు ప్రభుత్వం ఇదని మండిపడ్డారు. అంగన్వాడీ సిబ్బందిని పెన్షన్ పంపిణీకి వినియోగించాలని కోరారు.


ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి బొమ్మలా ఉంటారు , తప్ప ప్రభుత్వ తప్పిదాలపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ధ్వజమెత్తారు. పెన్షన్ వల్ల ఒక్కరూ ఇబ్బందిపడ్డా సీఎస్, జగన్మోహన్ రెడ్డిదే బాధ్యత అని చెప్పారు. ఇది మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకమన్నారు. కూటమి అధికారంలోకి వస్తే 4000 రూపాయలు ఇంటికి వచ్చి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని వర్ల రామయ్య హామీ ఇచ్చారు.


AP Elections 2024: రాజధానిపై జగన్ నిర్ణయం ఇదే.. అమరావతిపై మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే!

సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేస్తున్న సీఎస్ జవహర్ రెడ్డి : దేవినేని ఉమ

సీఎం జగన్మోహన్ రెడ్డి , సీఎస్ జవహర్ రెడ్డి పింఛన్ పంపిణీని గత నెలలో ఎలాగైతే ఇబ్బంది పెట్టారో అలానే వచ్చే నెలా కూడా చేద్దామని కుట్రలు పన్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు (Devineni Umamaheswara Rao) అన్నారు.జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో సీఎస్ పనిచేస్తున్నారని ఆరోపించారు. వచ్చే నెల 1,2 తేదీల్లో పింఛన్ పూర్తి పంపిణీ జరిగేలా చూడాలని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను దేవినేని ఉమ కోరారు.


AP Elections: సిగ్గు, సంస్కారం వదిలేశారు.. జగన్‌పై షర్మిల సంచలన కామెంట్స్..

ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేయాలి: లంకా దినకర్

నేరుగా ఇంటింటికీ వెళ్లి పెన్షన్‌ను పంపిణీ చేసే అవకాశం ఉన్న వైసీపీ ప్రభుత్వ తప్పుడు నిర్ణయంతో 32 మంది వృద్ధులు చనిపోయారని బీజేపీ నేత లంకా దినకర్ (Lanka Dinakar) అన్నారు. ఇవి ప్రభుత్వ హత్యలేనని చెప్పారు.సీఎస్ జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి తొత్తులా వ్యవహరించి వారి చావులకు కారణం అయ్యారని మండిపడ్డారు. వచ్చే మే నెలలో కూడా సచివాలయం సిబ్బంది, అధ్యాపకులు, అంగన్వాడీ సిబ్బంది ద్వారా నేరుగా ఇంటింటికీ పెన్షన్ పంపిణీ చేయాలని కోరామని లంకా దినకర్ తెలిపారు.


AP Elections: వైసీపీ మేనిఫెస్టో: నాడు - నేడు

సీఎస్ జవహర్ రెడ్డిని కలిసిన సరిగా స్పందించలేదు: శివ శంకర్

పెన్షన్ పంపిణీ విధానంపై వచ్చే నెల 1వ తేదీన ఇంటింటికీ వెళ్లి అందచేయాలని జనసేన అధికార ప్రతినిధి శివ శంకర్ (Shiva Shankar) కోరారు. ఈ విషయంపై సీఎస్ జవహర్ రెడ్డిని కలిశామని.. అయితే ఆయన బాధ్యతగా స్పందించకపోవడంతో అక్కడ ధర్నా నిర్వహించామని అన్నారు. పెన్షన్ పంపిణీపై గవర్నర్‌ని కలిశామని ఆయనకు వివరంగా చెప్పామన్నారు. గవర్నర్ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని శివ శంకర్ అన్నారు.


Chandrababu: నేరాలు, ఘోరాలు, అరాచకాల్లో జగన్ పీహెచ్డీ చేశారు

Read Latest Andhra pradesh News or Telugu News

Updated Date - Apr 27 , 2024 | 07:57 PM