Share News

AP Elections: అనంతలో పోలింగ్‌ బూత్‌ ఎత్తివేత.. టీడీపీ అభ్యర్థి హెచ్చరికతో..

ABN , Publish Date - May 09 , 2024 | 10:37 AM

Andhrapradesh: జిల్లాలో అర్ధాతరంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ బూత్‌లు మూసివేశారు. గడువు ఉండగానే పోలింగ్‌ బూత్‌లు మూసివేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని జూనియర్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ బూత్‌లను అధికారులు మూసివేశారు. అయితే పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌ నేటి వరకు గడువు ఉంది.

AP Elections: అనంతలో పోలింగ్‌ బూత్‌ ఎత్తివేత.. టీడీపీ అభ్యర్థి హెచ్చరికతో..
Officials closed Postal Ballot polling booths

అనంతపురం, మే 9: జిల్లాలో అర్ధాతరంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ బూత్‌లు (Potal Ballot Polling) మూసివేశారు. గడువు ఉండగానే పోలింగ్‌ బూత్‌లు మూసివేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని జూనియర్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ బూత్‌లను అధికారులు మూసివేశారు. అయితే పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌ నేటి వరకు గడువు ఉంది. అయితే అర్ధాంతరంగానే పోలింగ్‌ బూత్‌లను అధికారులు క్లోజ్ చేయడంపై టీడీపీ (TDP) ఆగ్రహం వ్యక్తం చేసింది.

ABN Big Debate with Chandrababu : జయం మాదే!


ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ అక్కడకు చేరుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే ఉద్యోగులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పోలింగ్ బూత్‌లు ఎందుకు ఎత్తివేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానంటూ ఆర్డీవోతో దగ్గుపాటి ప్రసాద్ ఫోన్లో మాట్లాడారు. దీంతో హడావిడిగా మళ్లీ అధికారులు పోలింగ్ బూత్‌లను ఓపెన్ చేశారు. దీంతో అక్కడ పరిస్థితి సర్దుమణిగింది.

Lok Sabha Polls: రిజర్వేషన్లపై రాద్దాంతం.. రాజ్యంగం ఏం చెబుతోంది..


టీడీపీకి ఓట్లు పడుతున్నాయనే...

ఈ వ్యవహారంపై దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. ఉద్యోగులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓట్లు పడుతున్నాయని అధికారులు ఇలా చేశారని ఆరోపించారు. ఓటర్లు వచ్చినా రాకపోయినా నిర్ణీత గడువు వరకు కచ్చితంగా పోలింగ్ బూత్‌లు తెరిచే ఉండాలన్నారు. వైసీపీ నేతలు చెప్పినట్టు ఎన్నికల అధికారులు వింటే ఇబ్బందులు పడతారని దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

Andhra Pradesh : కడప బాద్‌షా ఎవరో?

Andhra Pradesh : అప్పుల కుప్ప

Read Latest AP News And Telugu News

Updated Date - May 09 , 2024 | 11:04 AM