Share News

AP Elections: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఏర్పాట్లపై ఎస్‌ఈసీకి వర్ల రామయ్య లేఖ

ABN , Publish Date - Apr 19 , 2024 | 03:00 PM

Andhrapradesh: పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు తగిన ఏర్పాట్లు చేయడం లేదంటూ ఎస్‌ఈసీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ఎన్నికల డ్యూటీలోని ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఫామ్‌లు అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల వినియోగంపై నేటికి ఎటువంటి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయలేదన్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేసి ఫామ్-12 ఇవ్వాలని..

AP Elections: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఏర్పాట్లపై ఎస్‌ఈసీకి వర్ల రామయ్య లేఖ
TDP Leader Varla Ramaiah letter to SEC

అమరావతి, ఏప్రిల్ 19: పోస్టల్ బ్యాలెట్ (Postal Ballot Voting) ఓట్లకు తగిన ఏర్పాట్లు చేయడం లేదంటూ ఎస్‌ఈసీకి టీడీపీ నేత వర్ల రామయ్య (TDP Leader Varla Ramaiah) లేఖ రాశారు. ఎన్నికల డ్యూటీలోని ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఫామ్‌లు అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల వినియోగంపై నేటికి ఎటువంటి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయలేదన్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేసి ఫామ్-12 ఇవ్వాలని, పూర్తి చేసిన వాటిని స్వీకరించాలని ఎన్నికల కమీషన్ స్పష్టంగా పేర్కొందన్నారు. పోలీసు అధికారులు అప్లై చేసుకునే ఈడీసీ/పీబీ ధరఖాస్తులకు నోడల్ అధికారి తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు.

YSRCP: దువ్వాడకు ఇంటిపోరు ఎందుకు.. సతీమణి రివర్స్ కావడం వెనుక..!?


పోలీసులు పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్లను సంబంధిత ఆర్ఓలకు పంపేందుకు కూడా నోడల్ అధికారులు సహకరించాలన్నారు. ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొంతమంది ఆర్ఓలు ఫామ్ -12లు విడుదల చేయటం లేదని లేఖలో తెలిపారు. నేటికి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి చాలా చోట్ల తగిన ఏర్పాట్లు చేయలేదన్నారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలు అనుసరించి పోస్టల్ బ్యాలెట్ ఫామ్‌లు అందించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

YS Sunitha: నేను ప్రజల ముందుకొస్తే.. వైసీపీ నేతల్లో వణుకు పుట్టి..

YS Sharmila: ఇక్కడ ఫెయిల్ అయిన వ్యక్తి ఇంకో దగ్గర ఎలా పనికొస్తాడు?.. గుమ్మనూరుపై షర్మిల ఫైర్

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Updated Date - Apr 19 , 2024 | 03:03 PM