Share News

Lok Sabha Elections 2024: కేసీఆర్ నాకు ఇచ్చిన వారసత్వం అదే..సీఎం రేవంత్ వ్యంగ్యాస్త్రాలు

ABN , Publish Date - Apr 27 , 2024 | 08:26 PM

మాజీ సీఎం కేసీఆర్ (KCR) తనకు ఇచ్చిన వారసత్వం కరువని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సెటైర్లు గుప్పించారు. తాను అధిపత్యంపై యుద్ధం చేస్తున్నానని అన్నారు. శనివారం నాడు మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నీళ్లు, కరెంట్ ఎక్కువగా ఇస్తున్నామని చెప్పారు.

Lok Sabha Elections 2024: కేసీఆర్ నాకు ఇచ్చిన వారసత్వం అదే..సీఎం రేవంత్ వ్యంగ్యాస్త్రాలు

హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ (KCR) తనకు ఇచ్చిన వారసత్వం కరువని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సెటైర్లు గుప్పించారు. తాను అధిపత్యంపై యుద్ధం చేస్తున్నానని అన్నారు. శనివారం నాడు మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నీళ్లు, కరెంట్ ఎక్కువగా ఇస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది నీళ్ల వినియోగం బాగా పెరిగిందన్నారు. రాష్ట్రంలో పవర్ ఇంటరప్షన్స్ మాత్రమే ఉన్నాయని తెలిపారు.


KCR: ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్.. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేళ కేసీఆర్ తొలి పోస్ట్

2022 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ మధ్య వరకు పోల్చి చూస్తే అన్ని విషయాలు క్లియర్‌గా అర్థం అవుతాయన్నారు. పంట నష్టం తప్పకుండా ఇస్తామని స్పష్టం చేశారు. తాను తీసుకున్న నిర్ణయాల్లో ఏవైనా తప్పులు ఉన్నాయా అని ప్రశ్నించారు. నాలుగు నెలల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు రూ.24వేల కోట్లు మిత్తి కట్టామని తేల్చిచెప్పారు.


TG Elections 2024: రేవంత్‌తో ముగిసిన సీపీఎం నేతల భేటీ.. ఆ సీటు త్యాగం

తాము అసెంబ్లీలో అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇరుక్కుంటాననే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని చెప్పుకొచ్చారు. మహబూబ్ నగర్ తన సొంత జిల్లా అని ఎన్ని సార్లు అయినా వెళ్తానని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో14 ఎంపీ సీట్లు తప్పకుండా గెలుస్తామని జోస్యం చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్‌‌లో తప్పకుండా ఎంపీ స్థానాన్ని తాము గెలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Madhavilatha: మాధవీలత స్ట్రాంగ్‌ ఉమెన్‌.. ఇన్‌స్టాలో పోస్టు చేసిన రేణుదేశాయ్‌

Read Latest Election News or Telugu News

Updated Date - Apr 27 , 2024 | 08:32 PM