CBI raids: టీడీపీ నేత ఇంట్లో సీబీఐ సోదాలు
ABN , First Publish Date - 2022-11-04T09:03:53+05:30 IST
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఇంట్లో సీబీఐ అధికారుల తనిఖీలు నిర్వహఇంచారు.
శ్రీ సత్యసాయి జిల్లా: టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత (TDP State Executive Secretary Savitha) ఇంట్లో సీబీఐ అధికారుల (CBI Raid) తనిఖీలు నిర్వహఇంచారు. పెనుకొండలోని స్వగృహంలో సీబీఐ అధికారుల బృందం సోదాలు చేపట్టింది. శుక్రవారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. కర్ణాటకలో నమోదైన ఒకే విషయంలో విచారిస్తున్నట్లు సమాచారం. కాగా... ఈ విషయంపై అత్యంత గోప్యంగా స్థానిక పోలీసులకు సమాచారం లేకుండా సీబీఐ అధికారుల బృందం పెనుకొండకు చేరుకుంది. సవిత ఇంట్లో రికార్డులు, ఇతర లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు.