ఉద్దేశ్యపుర్వకంగానే ‘‘అమరరాజా’’పై వేధింపులు: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-12-02T19:08:32+05:30 IST

అమరరాజా బ్యాటరీస్ ఫ్యాక్టరీపై వైసీపీ ప్రభుత్వం కావాలనే కుట్రపన్నుతోందని మాజీ చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మండిపడ్డారు. చిత్తూరు జిల్లా తిరుపతి శివారులోని కరకకంబాడిలో ఉన్న అమరరాజా బ్యాటరీస్ ఫ్యాక్టరీని..

ఉద్దేశ్యపుర్వకంగానే ‘‘అమరరాజా’’పై వేధింపులు: చంద్రబాబు

నిడదవోలు: అమరరాజా బ్యాటరీస్ ఫ్యాక్టరీపై వైసీపీ ప్రభుత్వం కావాలనే కుట్రపన్నుతోందని మాజీ చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మండిపడ్డారు. చిత్తూరు జిల్లా తిరుపతి శివారులోని కరకకంబాడిలో ఉన్న అమరరాజా బ్యాటరీస్ ఫ్యాక్టరీని (Amararaja Batteries Factory) ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారనే వార్తల నేపథ్యంలో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై చంద్రబాబు నాయుడు స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. సుమారు ఇరవై వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అమరరాజా వంటి పరిశ్రమలను కూడా వైసీపీ ప్రభుత్వం.. పారిపోయేలా చేస్తోందని మండిపడ్డారు.

ఒకప్పుడు గల్లా కుటుంబం కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో టీడీపీ అధికారంలో ఉన్నా.. అమరరాజా ఇండస్ట్రీని ప్రోత్సహించామే తప్ప.. ఎలాంటి కుట్రలూ చేయలేదని చంద్రబాబు గుర్తు చేశారు. దివంగత సీఎం రాజశేఖర రెడ్డి (YS Rajasekhara Reddy) భూములు ఇస్తే.. వాటిని జగన్‌మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఏ తప్పూ లేకపోయినా అమరరాజా కంపెనీపై కేసులు పెట్టారని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో వేధించారని తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో.. తాను సీఎంగా ఉన్న సమయంలో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తే.. ప్రస్తుత సీఎం జగన్ నిరుద్యోగుల కడుపు కొడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇదిలావుండగా, అమరరాజా ఫ్యాక్టరీని ఇతర రాష్ట్రానికి తరలిస్తున్నారనే వార్తలు రావడంతో అందులో పని చేసే సిబ్బంది, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే ఉపాధి కోల్పోయి, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అమరరాజా బ్యాటరీస్ ఫ్యాక్టరీపై జరుగుతున్న కుట్రలు, తరలింపు అంశంపై ఆంధ్రజ్యోతిలో గతంలో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ఆ వార్తల కోసం కింది లింక్స్‌పై క్లిక్ చేయండి..

పగబట్టి పొగబెడుతున్నారు

మీకో దండం.. ఇక్కడ ఉండం!

పరిశ్రమలపై పగబడతారా?

‘అమరరాజా’కు భారీ షాక్‌!

అమర రాజా పరిశ్రమలో 9 యూనిట్లు మూత

తెలుగు నేలపై వెలుగు దివిటీ

అమరరాజాపై బలవంతపు చర్యలొద్ద

Updated Date - 2022-12-02T19:33:20+05:30 IST