Chittoorలో వైసీపీ మూకల దాడిని ఖండించిన లోకేష్
ABN , First Publish Date - 2022-12-30T15:52:38+05:30 IST
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandra Reddy) కనుసన్నల్లో పుంగనూరు, తంబళ్లపల్లెలో వైసీపీ ఫ్యాక్షన్ ముఠాలు అరాచకాలకు పాల్పడుతున్నారని
చిత్తూరు: పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం నంజంపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెద్దప్పరపల్లిలో జరిగే ‘ఇదేమి ఖర్మ-రాష్ట్రానికి’ టీడీపీ (tdp) చేపట్టిన కార్యక్రమాన్ని వైసీపీ (ycp) శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి బాబు ఆధ్వర్యంలో తెలుగు దేశం కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఆదరణ చూసి ఓర్వలేని వైసీపీ కార్యకర్తలు.. టీడీపీ శ్రేణుల వాహనాలపై దాడులకు తెగబడ్డారు. టీడీపీకి చెందిన పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. మరోవైపు ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లతో కొట్టుకున్నారు. ఇదిలా ఉంటే అధికార వైసీపీ శ్రేణులకు పోలీసులు(ap polices) సహకరించడం విశేషం.
వైసీపీ దాడిని ఖండించిన నారా లోకేష్
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandra Reddy) కనుసన్నల్లో పుంగనూరు, తంబళ్లపల్లెలో వైసీపీ ఫ్యాక్షన్ ముఠాలు అరాచకాలకు పాల్పడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఆరోపించారు. చిత్తూరు జిల్లా సోమల మండలం నంజంపేటలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించకుండా వైసీపీ అడ్డుకోవడం అప్రజాస్వామికం అని వ్యాఖ్యానించారు. టీడీపీ నేత చల్లా రామచంద్రారెడ్డి, టీడీపీ కార్యకర్తలపై రాళ్ల దాడి చేసిన వైసీపీ మూకల తీరుని తీవ్రంగా ఖండించారు. చట్టాన్ని గౌరవిస్తూ వస్తున్నామని.. దాడులు తీవ్రమైతే ప్రతిదాడులు ఉంటాయని పుంగనూరు డాన్ గుర్తుంచుకుంటే మంచిది అని నారా లోకేష్ హెచ్చరించారు.