YCP MLA: సమస్య చెబుతున్న వ్యక్తిపై చేయిచేసుకున్న జగన్ మేనమామ
ABN , First Publish Date - 2022-11-02T14:11:03+05:30 IST
కమలాపురం ఎమ్మెల్యే, సీఎం జగన్ రెడ్డి మేనమామ రవీంధ్రనాధ్ రెడ్డి ఓ కార్యక్రమంలో జనం మధ్య హల్ చల్ చేశారు.
కడప: కమలాపురం ఎమ్మెల్యే, సీఎం జగన్ రెడ్డి (YS Jagan mohan reddy) మేనమామ రవీంధ్రనాధ్ రెడ్డి(Ravindranath reddy) ఓ కార్యక్రమంలో జనం మధ్య హల్ చల్ చేశారు. సమస్య చెబుతున్న ఓ వ్యక్తిపై చిందులేసిన ఎమ్మెల్యే... అంతటితో ఆగకుండా చేయి కూడా చేసుకున్నారు. కమలాపురం నియోజకవర్గం విన్ పల్లె మండలం అందెల గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్యే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పబ్లిక్‌లో చేయిచేసుకోవడంతో ఎమ్మెల్యే (YCP MLA) తీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.