Kodalinani Order: సీఎం సభ ఉంది... పంట వేయొద్దు.. రైతులకు కొడాలినాని హుకుం

ABN , First Publish Date - 2022-11-25T12:47:35+05:30 IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సభ కారణంగా మినుము పంట వేయొద్దని రైతులకు మాజీ మంత్రి కొడాలి నాని హుకం జారీ చేశారు.

Kodalinani Order: సీఎం సభ ఉంది... పంట వేయొద్దు.. రైతులకు కొడాలినాని హుకుం

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan mohan reddy)సభ కారణంగా మినుము పంట వేయొద్దని రైతుల (Farmers)కు మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) హుకం జారీ చేశారు. డిసెంబర్ 21న గుడివాడ మల్లాయి పాలెం లే అవుట్‌లో సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు జరగుతున్నాయి. సభ దృష్ట్యా లే అవుట్ పక్కన ఉన్న 14 ఎకరాల్లో మినుము పంట వేయొద్దని రైతులకు కొడాలి నాని (Former Minister) ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో తమకు నష్టపరిహారం ఇప్పించాలంటూ రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది.

విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు (Ravi Venkateshwar Rao)అక్కడకు చేరుకుని రైతులను పరామర్శించారు. నష్టపరిహారం చెల్లించకుండా పంట వేయొద్దని ఎలా ఆదేశాలిస్తారని అధికారులకు ఫోన్ చేసి ప్రశ్నించారు. అదును దాటిపోతే తాము నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఎకరానికి వచ్చే రూ.30 వేల ఆదాయం కోల్పోతామన్నారు. అధికార పార్టీ నేతలు ఇంత నీచస్థితికి దిగజారడమా అంటూ మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గు లేకుండా రైతులను బెదిరిస్తారా అని మండిపడ్డారు. రైతులను ఇబ్బందుల పాలు చేస్తూ గుడివాడలో సీఎం సభను ఎలా నిర్వహిస్తారో చూస్తామని రావి వెంకటేశ్వరరావు (Former MLA)హెచ్చరించారు.

Updated Date - 2022-11-25T12:55:32+05:30 IST