Bonda Uma: పోలీసుల వైఫల్యం వల్లే కందుకూరు ఘటన
ABN , First Publish Date - 2022-12-30T13:23:08+05:30 IST
నారా లోకేష్ పాదయాత్ర (Nara Lokesh Padayatra) ప్రకటనతో వైసీపీ నాయకుల (YCP leaders) గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని టీడీపీ పొలిట్‌బ్యూరో మెంబర్ బోండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao)
అమరావతి: నారా లోకేష్ పాదయాత్ర (Nara Lokesh Padayatra) ప్రకటనతో వైసీపీ నాయకుల (YCP leaders) గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని టీడీపీ పొలిట్‌బ్యూరో మెంబర్ బోండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao) వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘టీడీపీ హయాంలో అభివృద్ధి పరుగులు తీస్తే... వైసీపీ హయాంలో పరిశ్రమలు కూడా రాకుండా పోయాయి. వైసీపీ సర్కార్ యువతను పూర్తిగా నిర్వీరం చేసింది. లోకేష్ యువగళం పాదయాత్రతో ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారబోతోంది. కందుకూరు ఘటన కొంతమంది రాజకీయం చేస్తున్నారు. కందుకూరు ఘటన (Kandukur Incident)లో పోలీసులు విఫలం. పోలీసుల వైఫల్యాన్ని పార్టీపై నెడతారా? వైసీపీ (ycp) మాజీ మంత్రులు రాబందుల్లా శవాల మీద కూడా రాజకీయం చేస్తున్నారు. ప్రతిపక్షనేతకు పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడంలో డీఐజీ వైఫల్యం చెందారు. చంద్రబాబు (Chandrababu) సభలకు ప్రజలు ఎలా తరలి వస్తున్నారో పోలీసులకు తెలియదా? దానికి తగినట్టు భద్రత కల్పించడం మీ బాధ్యత కాదా? తెలుగుదేశం (tdp) పార్టీని చూసి తాడేపల్లి ప్యాలెస్ వెన్నులో వణుకు మొదలయ్యింది. మాచర్ల, గుడివాడలో పోలీసులను అడ్డంపెట్టుకొని వైసీపీ నాయకులు కిరాతకంగా వ్యహరించారు. కొడాలి నాని.. రంగా చనిపోయినప్పుడు దేవినేని నెహ్రూ వద్దనే ఉన్నాడు. రంగా హత్య జరిగినప్పుడు కొడాలి నాని (Kodali Nani) నెహ్రూ దొడ్డిలో ఉన్నాడు. రంగా వర్ధంతి ఎవరు... ఏ సామాజిక వర్గం నిర్వహించాలో డిసైడ్ చేయడానికి కొడాలి నాని ఎవడు? విజయవాడలో వ్యభిచార గృహాలు, మసాజ్ పార్లర్లు, సెటిల్‌మెంట్లు, దందాలు చేస్తోంది మీ అవినాష్ కాదా? అవినాష్‌ను ప్రోత్సహిస్తోంది ముఖ్యమంత్రి జగన్ కాదా? ఆనాడు రాజశేఖర్ రెడ్డి (YS. Rajasekhar Reddy).. దేవినేని నెహ్రూను ప్రోత్సహిస్తే... ఈరోజు అవినాష్‌ను జగన్ (Cm jagan) ప్రోత్సహిస్తున్నారు.’’ అని బోండా ఉమ ఆరోపించారు.