AP News: శ్రీశైలం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2022-11-04T09:09:54+05:30 IST
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది.
నంద్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయాని (Srisailam temple)కి భక్తుల రద్దీ పెరిగింది. దీంతో మల్లికార్జునస్వామి గర్భాలయ స్పర్శదర్శనాలను దేవస్థానం అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ నెల 8 వరకు స్వామివారి గర్భాలయ అభిషేకాలు, అమ్మవారి అంతరాలయ కుంకుమర్చనల పూజలు నిలుపుదల చేయనున్నారు. సామూహిక అభిషేక సేవకర్తలకు కూడ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి దేవస్థానం అనుమతిస్తోంది. మరోవైపు ఈనెల 8న చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం ఆలయం ద్వారాలను మూసివేయనున్నారు. ఉదయం 6:30 నుంచి సాయంత్రం 6:30 వరకు స్వామిఅమ్మవార్ల దర్శనాలతో పాటు అన్ని ఆర్జితసేవలు శాశ్వత పరోక్ష సేవలను నిలుపుదల చేయనున్నారు. రాత్రి 8 గంటల నుంచి స్వామిఅమ్మవార్ల అలంకార దర్శనాలకు భక్తులకు అనుమతిస్తున్నట్లు ఈఓ లవన్న వెల్లడించనున్నారు.