Somireddy Chandramohan Reddy: ఎమ్మెల్యేలు, మంత్రులకు బుర్రుందా?

ABN , First Publish Date - 2022-12-27T11:06:10+05:30 IST

ఫించన్ల తొలగింపుపై జిల్లా కలెక్టర్‌నను టీడీపీ నేతలు సోమిరెడ్డి, బీద రవిచంద్ర, అబ్దుల్ అజీజ్ కలిసి వినతిపత్రం అందజేశారు.

Somireddy Chandramohan Reddy: ఎమ్మెల్యేలు, మంత్రులకు బుర్రుందా?

నెల్లూరు: ఫించన్ల తొలగింపుపై జిల్లా కలెక్టర్‌నను టీడీపీ నేతలు సోమిరెడ్డి, బీద రవిచంద్ర, అబ్దుల్ అజీజ్ కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అర్హులక ఫించన్లు ఇస్తామని కలెక్టర్ చెబుతున్నారని.. తమకైతే నమ్మకం లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పేదల నోళ్లు కొట్టడం అన్యాయమన్నారు. పేదల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు. జిల్లాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు బుర్రుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల గురించి పట్టించుకునే వారు లేరన్నారు. ఇరిగేషన్ పనుల్లో భారీ అక్రమాలు ఉన్నాయని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో డాటెడ్ భూముల సమస్యలు పరిష్కరించామని గుర్తుచేశారు. విత్తనాలు రైతులకు అందడం లేదని...ఈ విషయంలో మంత్రి ఏం చేస్తున్నారో తెలియడం లేదని సోమిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.

అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ... రూ.10వేల కోట్ల మేర పేదల కడుపు కొడుతున్నారన్నారు. ఎక్కువ కరెంట్ బిల్లు వచ్చిన వారి వివరాలు ఫించనుదారులకు కావాలనే ఎటాచ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీద రవిచంద్ర మాట్లాడుతూ... ప్రభుత్వం విచిత్రమైన వంకలతో ఫించన్లు తొలగిస్తోందన్నారు. రేషన్ కార్డుల పరిస్థితి గందరగోళంగా ఉందని తెలిపారు. చిత్తశుద్ది ఉంటే ఫించన్లు యధావిధిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల అనుమతి లేకుండా కలెక్టర్ కూడా వెళ్లలేకపోతున్నారన్నారు. జిల్లాలో ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు, వందల ఎకరాల భూస్వాములకు ఫించన్లు వస్తున్నాయని తెలిపారు.

Updated Date - 2022-12-27T11:06:12+05:30 IST