Somireddy: జగన్‌కి జనాన్ని చూస్తే భయం
ABN , First Publish Date - 2022-11-22T12:55:20+05:30 IST
జగన్‌కి(cm jagan) జనాన్ని చూస్తే భయం. అందుకే ఎక్కడికి వచ్చినా బారీకేడ్లు కడుతున్నారు. ఆడపిల్లలను చున్నీలు తీసి మీటింగ్‌కి రమ్మంటారా? అదే మీ ఇంటి ఆడపిల్లలు అయితే అలాగే చేస్తారా?
నెల్లూరు: మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలు శాంతియుతంగా మారితే.. ఇప్పుడు ఏపీ మాత్రం వల్లకాడైపోతుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి(Former minister Somireddy Chandramohan Reddy) ఆరోపించారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ జెన్కో ఎదుట పెద్ద ఎత్తున ఉద్యోగులు, కార్మికులు, కార్మిక సంఘాలు, టీడీపీ(tdp), సీపీఎం(cpm), సీపీఐ(cpi) పార్టీలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడారు. ‘‘జగన్‌కి(cm jagan) జనాన్ని చూస్తే భయం. అందుకే ఎక్కడికి వచ్చినా బారీకేడ్లు కడుతున్నారు. ఆడపిల్లలను చున్నీలు తీసి మీటింగ్‌కి రమ్మంటారా? అదే మీ ఇంటి ఆడపిల్లలు అయితే అలాగే చేస్తారా? అక్కడ జలగన్న ఉంటే.. ఇక్కడ తోడేలన్న ఉన్నాడు. ప్రభుత్వం అమ్మే మద్యంతో ప్రజలు మరణిస్తున్నారు. ఏపీ జెన్కోని అదానీకి ఇచ్చేదానికి వీలులేదు. కాదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. రొయ్యలను కొనేవాడు లేడు. రొయ్యల మేతలోనూ మీకు కమీషన్ అందాల్సిందేనా’’ అంటూ సోమిరెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు.