Bharat Jodo Yatra : గురుద్వారాలో రాహుల్ గాంధీ పూజలు... మహారాష్ట్రలో భారత్ జోడో యాత్ర ప్రారంభం...
ABN , First Publish Date - 2022-11-08T11:40:48+05:30 IST
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మంగళవారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో గురు నానక్ ఆశీర్వాదాలతో
ముంబై : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మంగళవారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో గురు నానక్ ఆశీర్వాదాలతో భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)ను ప్రారంభించారు. గురు నానక్ (Guru Nanak) జయంతి సందర్భంగా గురుద్వారా యాద్గారి బాబా జోరవర్ సింగ్ జీ ఫతేహ్ సింగ్ జీ నుంచి ఆశీర్వాదాలు పొందారు. ఆయన గురు నానక్ గురు పూరబ్ ఆర్దాస్ సమర్పించారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ట్వీట్‌లో, గురు ఆశీర్వాదాలతో పాదయాత్రను గురుద్వారా యాద్గారి బాబా జోరవర్ సింగ్ జీ ఫతేహ్ సింగ్ జీ నుంచి ప్రారంభించినట్లు తెలిపింది. రాహుల్ గాంధీ ఇచ్చిన ట్వీట్‌లో, మహారాష్ట్రలో భారత్ జోడో యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. గురు పూరబ్ శుభ సందర్భంగా గురుద్వారా యాద్‌గారీ బాబా జోరవర్ సింగ్ జీ, ఫతేహ్ సింగ్ జీలో అర్దాస్ చేసినట్లు తెలిపారు. గురు నానక్ ప్రేమ, శాంతి, సోదర భావం నుంచి స్ఫూర్తిని పొందుతూ భారత దేశాన్ని ఏకం చేయాలనే సంకల్పాన్ని నెరవేరుస్తామన్నారు. ప్రజలందరికీ గురుపూరబ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
భారత్ జోడో యాత్ర సోమవారం తెలంగాణా నుంచి మహారాష్ట్రలో ప్రవేశించింది.