2024 polls: వచ్చే ఎన్నికల్లో విపక్ష పీఎం అభ్యర్థి రాహుల్ గాంధీ...కమల్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-12-31T07:11:48+05:30 IST
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కమల్‌నాథ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు...
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కమల్‌నాథ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.(Kamal Nath) 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ నాయకుడు కమల్‌నాథ్ వ్యాఖ్యానించారు.(Rahul Gandhi)కాంగ్రెస్ దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహించినందుకు గాంధీని కమల్ నాథ్ ప్రశంసించారు. రాహుల్ అధికారం కోసం రాజకీయాలు చేయడం లేదని, దేశంలోని సాధారణ ప్రజల కోసం రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల విషయానికొస్తే రాహుల్ గాంధీ ప్రతిపక్షానికి ప్రధానమంత్రి అభ్యర్థి కూడా అవుతారని ఆయన అన్నారు.(Prime Ministerial Face)
ప్రపంచ చరిత్రలో ఇంత సుదీర్ఘమైన పాదయాత్రను ఎవరూ చేపట్టలేదని కూడా కమల్ నాథ్ పేర్కొన్నారు. గాంధీ కుటుంబం తప్ప మరే కుటుంబం దేశం కోసం ఇన్ని త్యాగాలు చేయలేదని కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు.మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని కమల్ నాథ్ ప్రకటించారు.