చనిపోతే అయినా తల్లిదండ్రులు చూడటానికి వస్తారనుకున్నాడేమో.. హాస్టల్‌లో ఓ బీటెక్ కుర్రాడి దారుణమిదీ..!
ABN , First Publish Date - 2022-12-16T18:21:36+05:30 IST
తల్లిదండ్రులంటే అతడికి ఎంతో గౌరవం, ప్రేమ. వారికి దూరంగా ఉండడం అసలు ఇష్టం ఉండేది కాదు. ఈ క్రమంలో వారు ఉపాధి నిమిత్తం ఏకంగా..
తల్లిదండ్రులంటే అతడికి ఎంతో గౌరవం, ప్రేమ. వారికి దూరంగా ఉండడం అసలు ఇష్టం ఉండేది కాదు. ఈ క్రమంలో వారు ఉపాధి నిమిత్తం ఏకంగా దుబాయ్‌కి వెళ్లిపోయారు. పని చేసుకుంటూ చాలా కాలంగా అక్కడే ఉండిపోయారు. మరోవైపు తల్లిదండ్రులకు దూరంగా ఉండలేక.. కొడుకు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఎంత కోరినా వారు తిరిగిరాకపోవడంతో తట్టుకోలేకపోయాడు. చనిపోతే కనీసం చూడటానికి అయినా వస్తారని అనుకున్నాడు. హాస్టల్‌లో ఉంటూ బీటెక్ చదువుతున్న ఆ కుర్రాడు.. చివరకు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..
కేరళలోని (Kerala) కోజికోడ్ పరిధికి చెందిన నితిన్ అనే యువకుడు బెంగళూరులోని (Bangalore) ఏఎంసీ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుకుంటున్నాడు. ఇతడి తల్లిదండ్రులు ఇద్దరూ దుబాయ్‌లో (Dubai) పని చేస్తుంటారు. అయితే నితిన్‌కు తల్లిదండ్రులు (parents) అంటే ఎంతో ప్రేమ. తల్లిదండ్రులు తనకు దూరంగా ఉండడం ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. కానీ కుటుంబ పోషణ నిమిత్తం వారు కూడా చాలా కాలంగా అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో పలుమార్లు వారికి పోన్ చేసి, చూడాలని ఉంది.. వచ్చేయండని కోరుతూ ఉండేవారు. అయితే వివిధ కారణాలతో వారు రావడానికి వీలు కాలేదు. దీంతో నితిన్ తీవ్ర మానసిక ఒత్తిడికి (mental stress) గురయ్యాడు.
ఇలాంటి పని చేయడానికి ఎలా మనసొచ్చిందమ్మా.. 10 రోజుల క్రితమే పుట్టిన పాపను ఎముకలు కొరికే చలిలో..
ఈ క్రమంలో డిసెంబర్ 14న తలనొప్పిగా ఉందంటూ మిత్రుడికి చెప్పి హాస్టల్ గదిలోనే పడుకున్నాడు. తోటి మిత్రులు కళాశాల అనంతరం సాయంత్రం హాస్టల్‌కి వచ్చారు. అయితే ఎంత పిలిచినా నితిన్ తలుపులు తీయలేదు. దీంతో హాస్టల్ వార్డెన్, సిబ్బంది సమాచారం అందించారు. చివరకు అంతా కలిసి బద్దలుకొట్టి గదిలోకి వెళ్లగా.. మరుగుదొడ్డిలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మానసిక ఒత్తిడికి గురైన నితిన్.. గొంతు కోసుకుని ఆత్మహత్యకు (suicide) పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.