కూతురిని చంపి సూట్‌కేసులో పెట్టి పారేసిన కేసులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు.. 10 రోజుల క్రితమే..

ABN , First Publish Date - 2022-11-24T15:52:38+05:30 IST

సూట్‌కేసులో యువతి మృతదేహం (young woman dead body) బయటపడిన కేసు తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సదరు యువతిని స్వయానే ఆమె తండ్రే చంపి, సూట్‌కేసులో పెట్టి..

కూతురిని చంపి సూట్‌కేసులో పెట్టి పారేసిన కేసులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు.. 10 రోజుల క్రితమే..

సూట్‌కేసులో యువతి మృతదేహం (young woman dead body) బయటపడిన కేసు తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సదరు యువతిని స్వయానే ఆమె తండ్రే చంపి, సూట్‌కేసులో పెట్టి ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మధుర పరిధి రాయ యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై పడేసినట్లు తెలిసింది. అలాగే ఈ కేసులో మరిన్ని సంచలన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

రోడ్డు పక్కన పడి ఉందో సూట్‌కేస్.. అనుమానంగానే ఓపెన్ చేసి చూసిన స్థానికులకు మైండ్‌బ్లాక్.. అందులో..

రాజస్థాన్ (Rajasthan) భరత్‌పూర్ ప్రాంతానికి చెందిన శీను (పేరు మార్చాం) అనే యువకుడి కుటుంబం ఢిల్లీలో నివసిస్తోంది. శీను తండ్రి ఇండియన్ ఆర్మీలో (Indian Army) పని చేస్తుండడంతో ఉద్యోగ రీత్యా ఇక్కడే ఉంటున్నారు. ఇదిలావుండగా, శీను ప్రస్తుతం బ్యాంక్ ఉద్యోగాలకు సంబంధించి కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడి స్నేహితురాలి ద్వారా నాలుగేళ్ల క్రితం ఆయుషి అనే యువతి పరిచయమైంది. ఆయుషి కూడా ఢిల్లీలోనే చదువుకుంటోంది. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తర్వాత ఆయుషిని డిస్కోలు, పబ్బులకు తీసుకెళ్తుండేవాడు.

యువతితో వివాహితుడి ప్రేమాయణం.. విషయం తెలిసి భార్య వదిలేయడంతో.. ప్రియురాలి వద్దకు వెళ్లి..

young-women.jpg

ఇలా కొన్నాళ్ల తర్వాత ఇద్దరూ పెళ్లి (marriage) చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో ఇంట్లో ఒప్పుకోరనే ఉద్దేశంతో.. కుటుంబ సభ్యులకు తెలీకుండా 15 నెలల క్రితం ఢిల్లీలోని ఆర్యసమాజ్‌లో (Delhi Arya Samaj) పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత ఆయుషి.. తన పెళ్లి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమ కూతర్ని ఇంటికి తీసుకొచ్చారు. నవంబర్ 17న ఆయుషి తన తల్లితో పెళ్లి విషయంపై గొడవపడింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆమె తండ్రి నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు. అయినా ఆయుషి మాత్రం శీను కావాలని అనడంతో తండ్రి కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే రివాల్వర్ తీసుకుని, కూతురి ఛాతిపై రెండు సార్లు కాల్చాడు. దీంతో ఆయుషి అక్కడికక్కడే మృతి చెందింది.

పదే పదే బయటికి వెళ్తున్న భార్య.. యువకులతో కలిసి డ్రగ్స్ తీసుకోవడంతో పాటూ.. ఆమె చేసిన నిర్వాకంతో.. చివరకు..

తర్వాత ఓ పాలిథిన్ కవర్‌లో కూతురి మృతదేహాన్ని చుట్టి, సూట్‌కేసులో పెట్టారు. అనంతరం భార్యతో కలిసి సూట్‌కేసును కారులో తీసుకెళ్లి.. మధుర పరిధి రాయ యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై పడేశాడు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు 14 బృందాలుగా ఏర్పడి.. చుట్టుపక్కల ప్రాంతాల్లోని సుమారు 300 సీసీ కెమెరాలను పరిశీలించారు. అయినా వారికి ఎలాంటి ఆధారాలూ లభించలేదు. ఈ క్రమంలో వారికి ఆయుషి ప్రాంతానికి చెందిన కొందరు ఫోన్ చేశారు. కొన్నాళ్లుగా ఓ యువతి కనిపించడం లేదని చెప్పడంతో పోలీసులకు అక్కడికి చేరుకుని విచారించారు. చివరకు ఆయుషి తల్లిదండ్రులను నేరం అంగీకరించడంతో కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

స్నేహితులతో కలిసి కొండల్లో మందు పార్టీ చేసుకున్న భర్త.. భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ..

Updated Date - 2022-11-24T15:54:16+05:30 IST