తాంత్రికుడి సలహా మేరకు.. ట్యూషన్ టీచర్ చేసిన నిర్వాకం.. చదువుకోవడానికి వచ్చిన బాలికను..
ABN , First Publish Date - 2022-11-01T21:15:58+05:30 IST
చాలా మంది మూఢనమ్మకాలను (Superstition) నమ్మి తమ జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా.. ఎదుటి వారి జీవితాలను కూడా నాశనం చేస్తుంటారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో కొందరు, పునర్జన్మలను నమ్మి మరికొందరు దారుణాలకు తెగబడుతుండడం గతంలో చాలా చూశాం. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో..
చాలా మంది మూఢనమ్మకాలను (Superstition) నమ్మి తమ జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా.. ఎదుటి వారి జీవితాలను కూడా నాశనం చేస్తుంటారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో కొందరు, పునర్జన్మలను నమ్మి మరికొందరు దారుణాలకు తెగబడుతుండడం గతంలో చాలా చూశాం. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. వివాహం కాకపోవడంతో ఓ ట్యూషన్ టీచర్.. తాంత్రికుడిని (Occult practitioner) సంప్రదించాడు. బాలిక ప్రైవేట్ పార్ట్‌కు సంబంధించిన రక్తంతో తడిసిన గుడ్డ తెమ్మని చెప్పాడు. దీంతో చివరకు ఆ టీచర్ దారుణానికి పాల్పడ్డాడు.
యువతి ఇయర్ బడ్స్‌పై కన్నేసిన చిలుక.. చివరకు ఎంత తెలివిగా దొంగతనం చేసిందో చూడండి..
పశ్చిమ బెంగాల్ (West Bengal) బంకురా జిల్లా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ గ్రామలో 37ఏళ్ల వ్యక్తి ట్యూషన్ చెబుతుంటాడు. దీంతో ఇతడి వద్దకు చాలా మంది బాలబాలికలు (Boys and girls) వస్తుంటారు. ఇదిలావుండగా, 37ఏళ్లు వచ్చినా వివాహం కాలేదనే (marriage) బాధతో ఉండేవాడు. ఈ క్రమంలో తెలిసిన వారు చెప్పడంతో ఓ తాంత్రికుడిని సంప్రదించాడు. తనకు త్వరగా వివాహం అయ్యేలా పూజలు చేయాలంటూ వేడుకున్నాడు. బాలిక ప్రైవేట్ పార్ట్‌కు చెందిన రక్తంతో తడిసిన గుడ్డ తీసుకొస్తే.. పూజలు చేస్తానని చెప్పాడు.
దీంతో తన వద్దకు చదువుకోవడానికి వచ్చే బాలికలపై కన్నేశాడు. ఓ రోజు ఎనిమిది ఏళ్ల వయసున్న బాలికను పక్క గదిలోకి పిలిచి, నోరు మూసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం రక్తంతో తడిసిన గుడ్డ తీసుకెళ్లాడు. తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఇంటికి వెళ్లిన బాలిక.. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. వీరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్యూషన్ టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే తాంత్రికుడిని కూడా అరెస్ట్ చేశారు. బాలిక పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వివాహ వేదికపై వధువుకు పురిటినొప్పులు.. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిన వరుడు.. చివరకు ఆస్పత్రిలో..