ప్రయాణికులతో కిక్కిరిసిన రైలు బోగీ.. సడన్‌గా కిటికీ వైపు నుంచి దూసుకొచ్చిన మృత్యువు..
ABN , First Publish Date - 2022-12-02T16:06:32+05:30 IST
మృత్యువు ఎప్పుడు, ఎటువైపు నుంచి వస్తుందో.. ఎవరూ చెప్పలేరు. ఒక్కోసారి సంతోషంగా ఉన్న సమయంలో సడన్‌గా ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. యూపీలోని రైల్వే స్టేషన్‌లో..
మృత్యువు ఎప్పుడు, ఎటువైపు నుంచి వస్తుందో.. ఎవరూ చెప్పలేరు. ఒక్కోసారి సంతోషంగా ఉన్న సమయంలో సడన్‌గా ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. యూపీలోని రైల్వే స్టేషన్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. సాధారణంగా రైలు ప్రమాదాలు.. డోరు వద్ద కూర్చుని ఉన్న సమయంలో.. రన్నింగ్ ట్రైన్‌ని ఎక్కుతున్న సమయంలో.. లేక పట్టాలు దాటుతున్న సమయంలోనో జరుగుతుంటాయి. కానీ ఓ వ్యక్తి విషయంలో ఎవరూ ఊహించని విధంగా జరిగింది. బోగీలో కిటికీ పక్కన కూర్చున్న వ్యక్తిని మృత్యువు కబలిస్తుందని ఎవరైనా ఊహిస్తారా. ఈ అనూహ్య ఘటనతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే...
Viral Video: ఫొటోలకు ఫోజులిస్తున్న నూతన వధూవరులు.. సడన్‌గా ఊహించని ఘటన.. వెనక్కు తిరిగి చూస్తే..
యూపీలోని (UP) అలీఘర్ జిల్లా సోమనా రైల్వే స్టేషన్‌లో (Railway station) శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్-3 పై నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలు (Express train) ఆగి ఉంది. ప్రయాణికులంతా హడావుడిగా బోగీల్లోకి ఎక్కుతున్నారు. ఈ క్రమంలో సుల్తాన్‌పూర్‌కు చెందిన హరికేష్ దుబే అనే వ్యక్తి కూడా జనరల్ బోగీలో ఎక్కి కూర్చున్నాడు. అప్పటిదాకా గందరగోళంగా ఉన్న బోగీలో.. ఊహించని ఘటనతో ఒక్కసారిగా విషాద వాతావరణం చోటుచేసుకుంది. కిటీకీ పక్కన కూర్చున్న హరికేష్.. కాసేపటికే విగతజీవిగా మారిపోయాడు. కిటికీకి అవతలి వైపు నుంచి ఓ ఇనుప రాడ్డు వేగంగా లోపలికి దూసుకొచ్చి, హరికేష్ మెడలో గుచ్చుకుంది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
పాటలు పాడుతూ యువతులతో ప్రేమ.. నాలుగు రాష్ట్రాల్లో ఆరు వివాహాలు.. ఓ రోజు రైల్వే స్టేషన్‌లో..
అంతా చూస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా (passengers) భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన కాసేపటికే పక్కన ఉన్న మరో బోగీలో ఇలాగే ఇనుప రాడ్డు గుచ్చుకుని ఓ యువకుడు గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్టేషన్ వద్ద కొన్నాళ్లుగా రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు (Railway track works) జరుగుతున్నాయని, ఇందులో భాగంగానే ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.