లిఫ్ట్ అడిగి మరీ మహిళా ప్రొఫెసర్ కారులో ఎక్కాడు.. ‘‘మేడం నా ఫోకస్ అంతా మీ పైనే’’ అంటూ నవ్వుతూనే..
ABN , First Publish Date - 2022-12-03T16:40:27+05:30 IST
అతనో ప్రభుత్వ పాఠశాల ప్రొఫెసర్. విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన అతను.. అందుకు విరుద్ధంగా యువతులు, మహిళలను టార్గెట్ చేసేవాడు. ఈ క్రమంలో ఏకంగా ఓ మహిళా ప్రొఫెసర్ పైనే కన్నేశాడు. ఓ రోజు ఫుల్‌గా తాగి లిఫ్ట్ అడిగి..
అతనో ప్రభుత్వ పాఠశాల ప్రొఫెసర్. విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన అతను.. అందుకు విరుద్ధంగా యువతులు, మహిళలను టార్గెట్ చేసేవాడు. ఈ క్రమంలో ఏకంగా ఓ మహిళా ప్రొఫెసర్ పైనే కన్నేశాడు. ఓ రోజు ఫుల్‌గా తాగి లిఫ్ట్ అడిగి మరీ ఆమె కారు ఎక్కాడు. కాస్త దూరం వెళ్లాక.. ‘‘మేడం నా ఫోకస్ అంతా మీ పైనే’’ అంటూ నవ్వుతూనే.. అమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
చెప్పింది కాకుండా మరో బ్రాండ్ సర్ఫ్‌ను కొని తెచ్చాడట.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిందో భార్య..
హర్యానాలోని (Haryana) గురుగ్రామ్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. ప్రభుత్వ కళాశాలలో ప్రొఫెసర్‌గా (Female professor) పని చేస్తున్నారు. అదే కళశాలలో రవి దేశ్వాల్ అనే వ్యక్తి సైకాలజీ ప్రొఫెసర్‌గా (Psychology Professor) పని చేస్తున్నాడు. అయితే ఇతడికి విద్యార్థులకు పాఠాలు బోధించడం పక్కన పెట్టి యువతులు, మహిళలపై ఎక్కువగా దృష్టి పెట్టేవాడు. ఈ క్రమంలో ఓ మహిళా ప్రొఫెసర్‌పై కన్నేశాడు. కళాశాలలో యూత్ పెస్టివల్ డే కార్యక్రమానికి ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. దీంతో గురువారం ఈ పనుల్లో భాగంగా మహిళా ప్రొఫెసర్.. అర్ధరాత్రి వరకూ ఉండాల్సి వచ్చింది. ఇదే అదునుగా భావించి రవి దేశ్వాల్ కూడా అక్కడే మకాం వేశాడు. రాత్రి కారులో బయటికి వస్తున్న మహిళను లిఫ్ట్ అడిగాడు.
అబార్షన్ చేయించేందుకు ప్రియురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లిన యువకుడు.. మద్యం సేవించిన డాక్టర్ చివరకు..
తోటి ఉద్యోగే కావడంతో ఆమె కూడా ధైర్యంగా కారులో ఎక్కించుకుంది. అయితే అప్పటికే ఫుల్‌గా తాగి ఉన్న రవి దేశ్వాల్.. కొంత దూరం వెళ్లాక ఆమె వైపు చూసి నవ్వుతూ.. ‘‘ మేడం.. నా ఫోకస్ అంతా నీ పైనే.. నువ్వంటే ఇష్టం (i like you madam)’’.. అంటూ తాకరాని చోట తాకుతూ అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తించాడు. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. ఏంటీ పనులంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా అతను వినిపించుకోలేదు. చివరికి కారు ఆపి గట్టిగా కేకలు వేయడంతో.. ‘‘సారీ మేడం’’.. అంటూ అక్కడి నుంచి పరారయ్యాడు. ఉదయం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Revenge Plan: సమాజం ఎటుపోతోంది.. ఓ 15 ఏళ్ల పిల్లాడు చేయాల్సిన పనులేనా ఇవి..!