రెండేళ్ల క్రితమే పెళ్లి.. హ్యాపీగా ఉండాల్సింది పోయి విషం తాగి ఆ భర్త ఆస్పత్రి పాలవడం వెనుక కథేంటంటే..!
ABN , First Publish Date - 2022-11-03T19:02:52+05:30 IST
కలకాలం సంతోషంగా జీవించాల్సిన ఆ దంపతుల మధ్య.. వివాహమై రెండేళ్లు కూడా పూర్తి కాకుండానే గొడవలు తలెత్తాయి. చిన్న చిన్న సమస్యలకూ గొడవ పడేవారు. చివరకు ఆమె తన భర్తను వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంటికి రావాలని ఎన్నిసార్లు బ్రతిమాలినా వినిపించుకోలేదు. భార్య రాకపోవడంతో అతడు మానసికంగా బాగా ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో ..
కలకాలం సంతోషంగా జీవించాల్సిన ఆ దంపతుల మధ్య.. వివాహమై రెండేళ్లు కూడా పూర్తి కాకుండానే గొడవలు తలెత్తాయి. చిన్న చిన్న సమస్యలకూ గొడవ పడేవారు. చివరకు ఆమె తన భర్తను వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంటికి రావాలని ఎన్నిసార్లు బ్రతిమాలినా వినిపించుకోలేదు. భార్య రాకపోవడంతో అతడు మానసికంగా బాగా ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో తన భార్య గురించి వినకూడని వార్త విన్నాడు. దీంతో మరింత మానసిక ఒత్తిడికి గురయ్యాడు. చివరకు విషం తాగి ఆస్పత్రి పాలయ్యాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
నిర్మానుష్య ప్రదేశంలో.. కూతురు కేకలు విని పరుగెత్తుకుంటూ వెళ్లిన తల్లి.. అక్కడి దృశ్యం చూసి..
బీహార్ (Bihar) రాష్ట్రం సమస్తిపూర్ జిల్లా మొహియుద్దీన్ నగర్ పరిధికి చెందిన గోవింద్ కుమార్‌కు మోహన్‌పూర్ పరిధికి చెందిన ఖుష్బూ కుమారితో 2020తో (marriage) వివాహమైంది. పెళ్లయిన కొత్తలో అందరి మాదిరి ఈ దంపతులు కూడా ఎంతో సంతోషంగా ఉండేవారు. దీంతో అటు దంపతుల (couple) తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉండేవారు. అయితే ఈ ఆనందం వారికి ఎన్నో రోజులు నిలవలేదు. కొన్ని నెలలకే గోవింద్, ఖుష్బూ మధ్య గొడవలు (quarrels) తలెత్తాయి. రోజురోజుకూ గొడవలు పెరిగిపోవడంతో ఖుష్బూ ఇటీవలే పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను తీసుకురావడానికి గోవింద్.. చాలా సార్లు ప్రయత్నించాడు.
కానీ భర్త వద్దకు వచ్చేందుకు మాత్రం ఆమె అంగీకరించలేదు. దీంతో గోవింద్ తీవ్ర మానసిక ఒత్తిడికి (mental stress) గురయ్యాడు. ఇలా ఉండగా, తాజాగా తన భార్య వేరే యువకుడితో (extramarital affair) వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో మరింత మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. తన భార్య అంటే ఎంతో ఇష్టమని, తాను తిరిగి వచ్చే వరకూ ఆత్మహత్యాయత్నం చేస్తూనే ఉంటానని చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.