సెల్ఫీ తీసుకుందామని పిలవడంతో.. షాపింగ్ మాల్ వెనుక వైపునకు వెళ్లింది.. కాసేపటి తర్వాత చూస్తే..
ABN , First Publish Date - 2022-11-02T17:18:53+05:30 IST
ఆప్యాయంగా మాట్లాడుతుండడంతో ఆ బాలిక తన స్నేహితుడిని సోదరుడిలా భావించింది. అయితే అతను మాత్రం మనుసులో బాలికపై ప్రేమ పెంచుకున్నాడు. రోజూ ఇద్దరూ ఫోన్లలో కూడా మాట్లాడుకునేవారు. అయినా ప్రేమ విషయం ఆమె వద్ద ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఓ రోజు ఇద్దరం మాట్లాడుకుందాం అంటూ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. తర్వాత..
ఆప్యాయంగా మాట్లాడుతుండడంతో ఆ బాలిక తన స్నేహితుడిని సోదరుడిలా భావించింది. అయితే అతను మాత్రం మనుసులో బాలికపై ప్రేమ పెంచుకున్నాడు. రోజూ ఇద్దరూ ఫోన్లలో కూడా మాట్లాడుకునేవారు. అయినా ప్రేమ విషయం ఆమె వద్ద ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఓ రోజు ఇద్దరం మాట్లాడుకుందాం అంటూ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. తర్వాత సెల్ఫీ తీసుకుందాం అంటూ నమ్మించాడు. అతడిని నమ్మి వెనుకే వెళ్లిన బాలిక పట్ల చివరకు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆసల్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
తాంత్రికుడి సలహా మేరకు.. ట్యూషన్ టీచర్ చేసిన నిర్వాకం.. చదువుకోవడానికి వచ్చిన బాలికను..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) భోపాల్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 13ఏళ్ల బాలిక (13 year old girl) .. తన సవతి తల్లితో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు హర్దా అనే ప్రాంతానికి చెందిన తిమర్ని అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. బాలిక మాత్రం అతన్ని ఒక సోదరుడిలా భావించిది. అతడు మాత్రం బాలికపై ప్రేమ (love) పెంచుకున్నాడు. కానీ ఈ విషయం ఆమె వద్ద ఎప్పుడూ ప్రస్తావించలేదు. రోజూ ఫోన్లలో కూడా మాట్లాడుకునే వారు. ఈ క్రమంలో అక్టోబర్ 28న బాలిక తన అత్త ఇంటికి వెళ్లింది. మధ్యాహ్న సమయంలో యువకుడు ఆమెకు ఫోన్ చేశాడు. భోపాల్‌లో బ్యాండ్ వాయించేందుకు వచ్చానని, ఒకసారి ఇధ్దరం మాట్లాడుకుందాం.. అంటూ పిలిచాడు.
పదే పదే పిలుస్తుండడంతో అతడు చెప్పిన చోటికి... తన సోదరితో పాటూ వెళ్లింది. తర్వాత ముగ్గురూ కలిసి ఓ షాపింగ్ మాల్ వద్దకు వెళ్లారు. సెల్ఫీ తీసుకుందామంటూ.. బాలిక సోదరిని అక్కడే ఉండమని చెప్పి, ఇద్దరూ కలిసి షాపింగ్ మాల్ వెనుక వైపు వెళ్లారు. సెల్ఫీ తీసే క్రమంలో ఆమె పట్ల అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇద్దరం పెళ్లి చేసుకుందామంటూ బలవంతం చేశాడు. తర్వాత అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన బాలిక.. రోజూ మౌనంగా ఉండేది. దీంతో తల్లి గట్టిగా ప్రశ్నించడంతో జరిగిన విషయం గురించి చెప్పింది. మంగళవారం తల్లీకూతుళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
వివాహ వేదికపై వధువుకు పురిటినొప్పులు.. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిన వరుడు.. చివరకు ఆస్పత్రిలో..