5 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులు.. 5 సార్లు గుంజీళ్లు తీయించి వదిలేశారు..!
ABN , First Publish Date - 2022-11-24T19:11:36+05:30 IST
ఎన్ని కఠిన శిక్షలు అమలు చేస్తున్నా.. బాలికలు, యువతులపై దాడులు ఆగడం లేదు. ఆఖరికి ఉరి శిక్షలు వేస్తున్నా కూడా నేరస్థుల్లో మార్పు రావడం లేదు. రోజు ఎక్కడో చోట..
ఎన్ని కఠిన శిక్షలు అమలు చేస్తున్నా.. బాలికలు, యువతులపై దాడులు ఆగడం లేదు. ఆఖరికి ఉరి శిక్షలు వేస్తున్నా కూడా నేరస్థుల్లో మార్పు రావడం లేదు. రోజు ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక మారుమూల గ్రామాల్లో జరిగే చాలా ఘటనలు వెలుగులోకి రావడం లేదు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో పంచాయతీలు నిర్వహించి, గ్రామ పెద్దలే శిక్షలు ఖరారు చేయడం చూస్తూనే ఉన్నాం. కొన్ని గ్రామాల్లో నిందితులకు విచిత్రమైన శిక్షలు వేస్తుంటారు. బీహార్‌లో ఇలాంటి ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఐదేళ్ల బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే గ్రామ పెద్దలు ఐదు గుంజీలు తీయించి పంచించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
WhatsApp Video call: వాట్సప్ కాల్‌ను లిఫ్ట్ చేయడమే అతడి పాలిట శాపమైంది.. రూ.63 వేలు పోయినా..
బీహార్ (Bihar) నవాడ అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ 22ఏళ్ల యువకుడు.. ఐదేళ్ల వయసున్న బాలిక (girl) పట్ల అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తించాడు. బాలికకు చాక్లెట్ ఆశ చూపించి, తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఈ క్రమంలో అతడు బాలికను తాకరాని చోట తాకుతూ అనుచితంగా ప్రవర్తించాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాలికను అతడి వద్ద నుంచి లాక్కెళ్లారు. తర్వాత గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించారు. అయితే వారు మాత్రం విచిత్రంగా కేవలం ఐదు గుంజీలు తీయించి పంపించారు. అయితే ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్ అవడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో స్థానిక పోలీసులు స్పందించారు. చివరకు బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
యువతితో వివాహితుడి ప్రేమాయణం.. విషయం తెలిసి భార్య వదిలేయడంతో.. ప్రియురాలి వద్దకు వెళ్లి..