Bandi Sanjay: కేసీఆర్ కుటుంబాన్ని వదిలేదేలే...
ABN , First Publish Date - 2022-12-01T14:40:09+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిర్మల్: ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana CM KCR) పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (BJP State Chief Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. కుంటాల మండలం ఓలా గ్రామంలో ప్రజా సంగ్రామ యాత్ర రచ్చబండ కార్యక్రమంలో సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. లిక్కర్, డ్రగ్స్, పత్తాల దందా చేసేటోళ్ల అంతు చూస్తామని హెచ్చరించారు. బెంగూళురు డ్రగ్స్ స్కాం కేసును మూయించింది కేసీఆరే అని ఆరోపించారు. ఆ కేసును మళ్లీ తిరగదోడాలని... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేశారు. కేసీఆర్ పైనున్న పాత కేసులన్నీ తిరగదోడాల్సిందే అని అన్నారు. ప్రజల సొమ్మను దోచుకుంటూ కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. ట్విట్టర్ టిల్లు.... మిషన్ భగీరథ నీళ్లేవని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం, నిరుద్యోగ భ్రుతి, రుణమాఫీ, దళిత బంధు హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ఢిల్లీ లిక్కర్స్ స్కామ్లో కవిత ప్రమేయం ఉన్నదని బండి సంజయ్ ఆరోపించారు.