Bandi Sanjay: ప్రధానిపై ఇష్టానుసారంగా మాట్లాడితే బుద్ధి చెబుతాం
ABN , First Publish Date - 2022-12-17T13:58:26+05:30 IST
ప్రధానిపై ఇష్టానుసారంగా మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ హెచ్చరించారు.
హైదరాబాద్: ప్రధాని (PM Narendra Modi)పై ఇష్టానుసారంగా మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (BJP State leader Bandi Sanjay) హెచ్చరించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్థాన్ అంటేనే ఉగ్రవాదుల దేశమన్నారు. మోదీ టెర్రరిస్ట్ కాదని... గుజరాత్ అల్లర్లలో మోదీని అమెరికా రాకుండా చేస్తే సుప్రీం తీర్పు తర్వాత రెడ్ కార్పెట్‌తో అమెరికా స్వాగతం పలికిందని గుర్తుచేశారు. పాక్ విమర్శలపై ప్రతి భారతీయుడు స్పందించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.