ED: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పురోగతి
ABN , First Publish Date - 2022-12-24T20:16:20+05:30 IST
ఎమ్మెల్యేల (MLAs) కొనుగోలు కేసులో కీలక పురోగతి కనిపించింది.
హైదరాబాద్: ఎమ్మెల్యేల (MLAs) కొనుగోలు కేసులో కీలక పురోగతి కనిపించింది. నిందితుడు నందును రెండురోజులపాటు ప్రశ్నించేందుకు ఈడీకి (ED) నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతితో నందును ఈడీ 2 రోజులు విచారించనుంది. సోమవారం నుంచి నందును చంచల్‌గూడ జైలులో ఈడీ విచారించనుంది. చంచల్‌గూడ జైలులో నందు స్టేట్మెంట్‌ను ఈడీ నమోదు చేయనుంది. నందు విచారణకు 3 రోజులు అనుమతి కావాలని ఈడీ నాంపల్లి కోర్టును కోరింది.