MLA Rajasingh: మరోసారి వివాదంలో చిక్కుకున్న రాజాసింగ్

ABN , First Publish Date - 2022-12-07T12:32:55+05:30 IST

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.

MLA Rajasingh: మరోసారి వివాదంలో చిక్కుకున్న రాజాసింగ్

హైదారాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Goshamahal MLA Rajasingh) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా రాజాసింగ్‌కు మంగలహాట్ పోలీసులు మరో రెండు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. అయితే డిసెంబర్ 6, 1992లో కర సేవకులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ, బలిదానాలు స్మరిస్తూ పెట్టిన పోస్ట్ ఎక్కడ కూడా వివాదాస్పదం లేదని రాజాసింగ్ తెలిపారు. లవ్ జిహాద్ శ్రద్ధ మర్డర్ కేసు‌లో ఫేస్‌బుక్‌లో వైరల్ అవుతున్న మీమ్‌‌కు తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. పోలీసులు అత్యుత్సహంతో కలరింగ్ ఇచ్చి షోకాజ్ నోటీసులు ఇచ్చారని రాజాసింగ్ తరపు న్యాయవాది తెలిపారు. రేపటిలోగా షోకాజ్ నోటీసులకు పూర్తి స్థాయి లిఖితపూర్వక వివరణ ఇస్తామని అన్నారు. తమ రిప్లై‌కి సంతృప్తి చెందికపోతే హైకోర్టును ఆశ్రయించనున్నట్లు రాజాసింగ్ వెల్లడించారు.

Updated Date - 2022-12-07T12:32:56+05:30 IST