Harish Rao: ఆంధ్రాలో చెల్లని రూపాయి.. తెలంగాణలో చెల్లుతుందా?

ABN , First Publish Date - 2022-12-22T14:29:42+05:30 IST

ఏపీ (AP) ప్రజల చేతిలో ఛీత్కారాలు తిన్న చంద్రబాబు తెలంగాణలో ఏం ఉద్దరించడానికి ఇక్కడికి వస్తున్నారని

Harish Rao: ఆంధ్రాలో చెల్లని రూపాయి.. తెలంగాణలో చెల్లుతుందా?
తెలంగాణలో చెల్లుతుందా?

హైదరాబాద్: ఏపీ (AP) ప్రజల చేతిలో ఛీత్కారాలు తిన్న చంద్రబాబు తెలంగాణలో ఏం ఉద్దరించడానికి ఇక్కడికి వస్తున్నారని మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ప్రశ్నించారు. ఖమ్మం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) చేసిన వ్యాఖ్యలపై మంత్రులతో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ఏపీలో చంద్రబాబు పాలన బాగోలేకే అక్కడి ప్రజలు చిత్తుగా ఓడించారని వ్యాఖ్యానించారు. ఆంధ్రాలో చెల్లని రూపాయి.. తెలంగాణలో చెల్లుతుందా? అని నిలదీశారు. చంద్రబాబు పాలనలో తెలంగాణ(Telangana) దోపిడీకి గురైందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు చంద్రబాబుపై స్పష్టత ఉందని తెలిపారు. తెలంగాణలో ఫ్లోరోసిస్‌‌ను పారద్రోలినట్లుగా చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రైతు ఆత్మహత్య(Farmer suicide)లు జరిగింది చంద్రబాబు హయాంలోనేనని గుర్తుచేశారు. బషీర్‌బాగ్ చేదు జ్ఞాపకాలు ప్రజలు ఇంకా మరిచిపోలేదని చెప్పుకొచ్చారు. అసలు ఈ ప్రాంతం గురించి మాట్లాడే అర్హతకు చంద్రబాబుకు లేదన్నారు. బీజేపీ(BJP)తో ఆంధ్రాలో పొత్తు పెట్టుకొనేందుకే చంద్రబాబు డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇక్కడ కూడా బలముందని చూపుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబుతో ఎవరైనా పొత్తు పెట్టుకుంటే భస్మాసుర హస్తమేనని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్(NTR) గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.

Updated Date - 2022-12-22T14:29:44+05:30 IST