MP Arvind: ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-11-18T11:56:57+05:30 IST

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.

MP Arvind: ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు(TRS Activists) దాడికి పాల్పడ్డారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (TRS MLC Kavitha)పై అర్వింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశారు. కాగా ఎంపీ అర్వింద్ (BJP MP) ప్రస్తుతం నిజామాబాద్‌లో ఉన్నారు. బంజారాహిల్స్‌లోని ఎంపీ ఇంట్లోకి టీఆర్ఎస్ కార్యకర్తలు చొరబడి అద్దాలు పగలగొట్టారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు కార్యకర్తలు అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

Updated Date - 2022-11-18T12:02:12+05:30 IST