Revanth Reddy: కేసీఆర్‌కు సిగ్గుండాలి

ABN , First Publish Date - 2022-12-14T11:59:42+05:30 IST

కాంగ్రెస్ వార్ రూమ్‌పై దాడికి సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.

Revanth Reddy: కేసీఆర్‌కు సిగ్గుండాలి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ వార్ రూమ్‌పై దాడికి సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) స్పందించారు. కేసీఆర్ ప్రభుత్వం (KCR Government) నిన్న సాయంత్రం కాంగ్రెస్ వార్ రూమ్‌పై దాడి చేసి సిబ్బంది‌ని అరెస్ట్ చేశారని అన్నారు. వార్‌రూమ్‌లో ఉన్న 50 కంప్యూటర్‌లను దొంగిలించారని ఆరోపించారు. దాదాపు ఏడాది పాటు సేకరించిన డేటాను పోలీసులు దొగలించారని మండిపడ్డారు. ఈ ఘటనపై డీజీపీ, కమిషనర్‌లకు ఫోన్ చేసినా స్పందించలేదని అన్నారు. పోలీసులు ఫోన్ ఎత్తడం లేదని వారు దొంగలా?.. పోలీసులో అర్థం కావడం లేదని విమర్శించారు. తెలంగాణలో ఉన్న పరిస్థితులు, అంచనాలపై ఉన్న డేటాను పోలీసులు దొంగిలించారన్నారు. అధికారం కోల్పోతున్నారని కేసీఆర్ ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు సిగ్గుండాలని వ్యాఖ్యలు చేశారు. ఎఫ్‌ఐఆర్ కాపీ ఇవ్వకుండా కార్యాలయంపై దాడి చేస్తారా అని ప్రశ్నించారు. సెంట్రల్ టాస్క్ ఫోర్స్ మెంబెర్ సునీల్ కనుగులు కీలకమైన పదవిలో ఉన్నారన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని, హైదరాబాద్‌లో కమిషనరేట్‌ను ముట్టడిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-14T11:59:43+05:30 IST