Congress leader: కవితపై జీవన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-11-19T12:15:16+05:30 IST
టీఆర్ఎస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి(MLC Jeevan Reddy) కూడా.. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత(mlc kavitha)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కవితకు
జగిత్యాల: టీఆర్ఎస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి(MLC Jeevan Reddy) కూడా.. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత(mlc kavitha)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కవితకు వెన్నుపోటు పొడిచింది సొంతపార్టీ ఎమ్మెల్యేలేనని వ్యాఖ్యానించారు. కవిత గెలిస్తే ఆధిపత్యం చేలాయిస్తుందేమోనన్న భయంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఆమెను ఓడించారని ఆరోపించారు. కవితను కనపడకుండా చేయాలని చూసింది ఆ పార్టీ ఎమ్మెల్యేలేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఒక్క ఎంపీని కూడా గెలిపించుకోలేకపోయారని విమర్శించారు. ఎమ్మెల్యేలకు వచ్చిన ఓట్లు కవితకు ఎందుకు పడలేదని ప్రశ్నించారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో రైతులతో నిజామాబాద్‌లో నామినేషన్ వేయించింది బీజేపీనేనని తెలిపారు. ఒకవేళ కాంగ్రెస్ నామినేషన్ వేయిస్తే.. వాళ్లు బీజేపీలో ఎందుకు చేరుతారని జీవన్‌రెడ్డి నిలదీశారు.
ఎంపీ అరవింద్ కూడా అవే వ్యాఖ్యలు..
హైదరాబాద్‌లో బీజేపీ ఎంపీ అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి తర్వాత ఒక్కసారిగా తెలంగాణ రాజకీయం వేడెక్కింది. దాడిపై ఎంపీ అరవింద్ స్పందిస్తూ.. ఎమ్మెల్సీ కవిత ప్రెస్‌మీట్‌లో పక్కనకూర్చున్న ఎమ్మెల్యేలే ఆమెను ఓడగొట్టారని అరవింద్ కూడా ఆరోపించారు.