Bandi Sanjay: భైంసా అల్లర్ల బాధితులతో బండిసంజయ్ భేటీ
ABN , First Publish Date - 2022-11-29T13:11:01+05:30 IST
భైంసా అల్లర్ల బాధితులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ భేటీ అయ్యారు.
నిర్మల్: భైంసా అల్లర్ల బాధితులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay kumar) భేటీ అయ్యారు. అల్లర్లలో సర్వస్వం కోల్పోయిన 30 మంది బాధిత కుటుంబాలను సంజయ్ ఓదార్చారు. తమపైనే దాడి చేసి, పీడీ యాక్ట్ కేసులు పెట్టి తీవ్రంగా వేధించారని భైంసా బాధితులు ఏకరువు పెట్టారు. అల్లర్ల బాధితులకు బీజేపీ పూర్తి అండగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భరోసా ఇచ్చారు. ఇప్పటికే కొంత సహాయం చేశామని... బీజేపీ అధికారంలోకి రాగానే మరింత సహాయం చేస్తామని స్పష్టం చేశారు. బాధితుల పట్ల సీఎం కేసీఆర్ వివక్ష చూపడం దుర్మార్గమని బండి సంజయ్ (BJP State president)ఆగ్రహం వ్యక్తం చేశారు.